Budget news: కారు కొంటే ఆదాయపు పన్ను తగ్గింపు.. బడ్జెట్‌లో ప్రకటనతో ఇలా బెనిఫిట్
Budget 2024: ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వేతన జీవులు ఆశించిన స్థాయిలో పెద్ద ప్రకటనలు ఏమీ వెలువడలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ను 50 నుంచి 75 వేలకు పెంచడం, పన్ను శ్లాబ్‌లో చిన్నపాటి మార్పులు మినహా చెప్పుకోదగినవి లేవు. అయితే బడ్జెట్‌లో చాలా మందికి అర్థం కాని ఓ బెనిఫిట్ కూడా దాగి ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్‌లో TDS పన్ను మినహాయింపును తగ్గించే ప్రతిపాదన పార్లమెంటుకు సమర్పించారు. ఇది చాలా మందికి పరోక్షంగా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. విదేశీ చెల్లింపులు మరియు కారు కొనుగోళ్లపై TCS చెల్లించిన వ్యక్తులు TDS కటింగ్ విషయంలో వారి కంపెనీ నుంచి రాయితీని పొందవచ్చని సూచిస్తున్నారు.

ఓ కంపెనీ ఉద్యోగి జీతంపై TDSని లెక్కించినప్పుడు వారి విదేశీ చెల్లింపులు లేదా ఇతర చెల్లింపులకు సంబంధించిన TCS పరిశీలించి జీతం నుంచి TDS తీసివేస్తుంది. అయితే తాజా మార్పు వల్ల ఉద్యోగులు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నప్పుడు తక్కువ TDS కట్ అయ్యే అవకాశం లభిస్తుంది. తద్వారా ప్రతి నెలా ఎక్కువ జీతం చేతికి వస్తుంది. ఓవర్‌పెయిడ్ టాక్స్‌ను కూడా తేలికగా తిరిగి పొందగలుగుతారు.
ఇప్పటివరకు ITR దాఖలు చేసేటప్పుడు విదేశీ చెల్లింపులు మరియు కార్ల కొనుగోలుపై చెల్లించిన TCS మొత్తాన్ని తిరిగి క్లెయిమ్ చేయాల్సి వచ్చేది. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ కావడంతో చాలా మంది తమ పన్ను వాపసులను పొందడంలో ఆలస్యం అవుతుండేది. కాగా కొత్త నోటిఫికేషన్ ప్రకారం యజమానులు తమ ఉద్యోగుల TCS గణనలో సదరు మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోగలరు. ఫలితంగా జీతం నుంచి తక్కువ TDS తీసివేయబడటమే కాకుండా ఆదాయపు పన్ను వాపసు కూడా వేగంగా జరగనుంది.


Click it and Unblock the Notifications