New Baggage Rules: అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి ఊరటనిచ్చేలా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న డ్యూటీ-ఫ్రీ దిగుమతి పరిమితిని పెంచుతూ.. కొత్తగా రూ. 75 వేల వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా భారత్‌కు తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది. ఈ మార్పులు 'బ్యాగేజ్ రూల్స్, 2026' కింద చేపట్టగా.. ఫిబ్రవరి 2, 2026 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత బ్యాగేజ్ నిబంధనల్లో ఈ స్థాయిలో మార్పులు రావడం ఇదే మొదటిసారి.
ఈ కొత్త నిబంధనలతో ప్రధానంగా లబ్ధి పొందేది భారతీయ పౌరులు అని చెప్పవచ్చు. అలాగే విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలు.. విమాన మార్గం లేదా సముద్ర మార్గం ద్వారా భారత్‌కు వచ్చే వీరంతా తమ వ్యక్తిగత వినియోగానికి సంబంధించిన వస్తువులను రూ. 75 వేల విలువ వరకు కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. ఈ పరిమితి ప్రయాణికుడు వెంట తెచ్చుకునే పర్సనల్ బ్యాగేజ్, చెక్-ఇన్ లగేజ్ రెండింటికీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇంతకు ముందు ఈ డ్యూటీ-ఫ్రీ పరిమితి రూ. 50 వేలు మాత్రమే ఉండేది. పెరిగిన ధరలు, అంతర్జాతీయ మార్కెట్లలో వస్తువుల ఖర్చులు, ప్రయాణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పరిమితిని పెంచింది. దీనివల్ల విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అదనపు కస్టమ్స్ చార్జీల భయం లేకుండా అవసరమైన వస్తువులను తీసుకురాగలుగుతారు.
ఈ మార్పులు భారతీయులకు మాత్రమే కాకుండా, విదేశీ పర్యాటకులకు కూడా వర్తిస్తాయి. విదేశీ ప్రయాణికులు ఇప్పుడు రూ. 25 వేల వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా తీసుకురావచ్చు. గతంలో ఈ పరిమితి కేవలం రూ. 15 వేలు మాత్రమే ఉండేది. ఈ పెంపు వల్ల భారత్‌కు వచ్చే పర్యాటకులకు మరింత సౌకర్యం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త బ్యాగేజ్ రూల్స్‌లో బంగారు ఆభరణాల విషయంలోనూ స్పష్టత ఇచ్చారు. కనీసం ఒక సంవత్సరం పాటు విదేశాల్లో నివసించి భారత్‌కు తిరిగి వస్తున్న భారతీయులు లేదా భారత మూలాలు ఉన్నా విదేశీ పౌరసత్వం కలిగిన వారికి ప్రత్యేక సడలింపులు వర్తిస్తాయి. మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు Gold ఆభరణాలను, పురుషులు లేదా ఇతర ప్రయాణికులు 20 గ్రాముల వరకు బంగారాన్ని డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. అయితే ఈ ఆభరణాలు వ్యక్తిగత వినియోగానికి సంబంధించినవై ఉండాలని, వాణిజ్య ఉద్దేశంతో ఉండకూడదని నిబంధనలో పేర్కొన్నారు.
ఈ కొత్త విధానానికి ప్రధాన లక్ష్యం ప్రయాణికులపై ఉన్న అనవసరమైన నియంత్రణలను తగ్గించడం, కస్టమ్స్ ప్రక్రియను సులభతరం చేయడం, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం. గతంలో ఉన్న నిబంధనలు కాలానికి తగ్గట్టు లేకపోవడంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ మార్పులు తీసుకొచ్చింది. డ్యూటీ-ఫ్రీ పరిమితి పెరగడం వల్ల ప్రయాణికులు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, బహుమతులు, వ్యక్తిగత వినియోగ వస్తువులు వంటి వాటిని తక్కువ ఖర్చుతో భారత్‌కు తీసుకురాగలుగుతారు. దీంతో విదేశీ కొనుగోళ్లపై వచ్చే అదనపు భారం తగ్గుతుంది.
క్లుప్తంగా చెప్పాలంటే.. ఈ కొత్త బ్యాగేజ్ నిబంధనలు అంతర్జాతీయ ప్రయాణికులకు అనుకూలంగా ఉండటమే కాకుండా, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు. ప్రయాణానికి ముందే ఈ నియమాలను తెలుసుకుని, అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటే కస్టమ్స్ వద్ద ఎలాంటి సమస్యలు ఎదురుకావని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications