IPO News: తొలిరోజే లాభాల సునామీ.. ఆశ్చర్యంలో ఐపీవో ఇన్వెస్టర్లు..
Netweb technologies IPO: ఈవారం స్టాక్ మార్కెట్లోకి అనేక ఐపీవోలు అడుగుపెట్టాయి. అయితే ఇవన్నీ ఇన్వెస్టర్లను అస్సలు నిరాశకు గురిచేయలేదు. తాజాగా ఐపీవోల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీ లాభాలను పొందారు.
నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఇండియా ఐపీవో నేడు స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ సమయంలో దూసుకెళ్లింది. కంపెనీ షేర్లు తొలిరోజే ఇన్వెస్టర్లను ధనవంతులను చేశాయి. BSEలో నెట్‌వెబ్ టెక్నాలజీస్ షేర్లు రూ.942.50 వద్ద లిస్ట్ చేయబడ్డాయి. NSEలో నెట్‌వెబ్ టెక్నాలజీస్ షేర్ రూ.947 ధర వద్ద లిస్ట్ అయ్యాయి. కంపెనీ షేర్లు ఇష్యూ ధర కంటే 88.50% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఐపీవోలో డబ్బు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఒక్కో షేరుకు రూ.442.50 లాభాన్ని పొందారు.

విజయవంతంగా లిస్ట్ అయిన ఐపీవోను పరిశీలిస్తే.. నెట్‌వెబ్ టెక్నాలజీస్ IPO 90.55 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. కంపెనీ IPOలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 19.48 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(QIB) కోటా 220.69 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. IPOలో నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(NII) కోటా 83.21 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా.. ఉద్యోగుల కోటా 55.92 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది.
ఐపీవో ప్రారంభం నాటి నుంచే గ్రే మార్కెట్లో కంపెనీ షేర్లకు బలమైన స్పందన లభించింది. లిస్టింగ్ ముందురోజు బుధవారం గ్రే మార్కెట్లో కంపెనీ షేర్లు రూ.400 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. కంపెనీ IPO జూలై 17న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడింది. జూలై 19న ఐపీవో ముగిసింది. నెట్‌వెబ్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ రూ.631 కోట్ల వరకు ఉంది. కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.475-500గా ఉంచిన సంగతి తెలిసిందే. ఒక్కో లాట్ లో 30 షేర్లను కంపెనీ ఐపీవోలో ఉంచింది.


Click it and Unblock the Notifications