IPO News: భయం సృష్టించటానికి వచ్చేస్తున్న 2 ఐపీవోలు.. పూర్తి వివరాలు..!
IPO News: ప్రస్తుతం మార్కెట్లలోకి వస్తున్న ఐపీవోలు ఇన్వెస్టర్లకు అస్సలు ఖాళీ ఇవ్వటం లేదు. ఒకదాని తర్వాత మరొకటి మంచి లాభాలను సైతం ఇటీవల లిస్టింగ్ సమయంలో అందించాయి.
కొన్ని ఐపీవోల నుంచి ఇన్వెస్టర్లు బంపర్ లాభాలు కూడా ఆర్జించారు. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ IPOకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఇది 100 కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. తాజాగా నేడు రెండు ఐపీవోలు దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రారంభం కానున్నాయి. వీటిలో ఒకటి ట్‌వెబ్ టెక్నాలజీస్ కాగా.. మరొకటి అషర్ఫీ హాస్పిటల్ ఐపీవో. ఈ రెండు కంపెనీలు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.658 కోట్లను సమీకరిస్తున్నాయి.

ముందుగా నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఐపీవోకు గ్రే మార్కెట్‌లో మంచి స్పందన లభిస్తోంది. ఈ IPO గ్రే మార్కెట్‌లో రూ.350 కంటే ఎక్కువ ప్రీమియంతో కొనసాగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే షేర్లు మార్కెట్లో రూ.858 ధర వద్ద లిస్టింగ్ అవ్వొచ్చని తెలుస్తోంది. హై-ఎండ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ అందించే ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ.475-500 ధరను నిర్ణయించింది. ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు జూలై 24న జరిగే అవకాశం ఉండగా.. జూలై 27న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్టయ్యే అవకాశం ఉంది.
ఇదే క్రమంలో జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో 250 పడకల ఆసుపత్రిని నడుపుతున్న అష్రాఫీ హాస్పిటల్ సంస్థ తన ఐపీవోను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.51.52గా నిర్ణయించింది. ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు జూలై 24న జరగవచ్చని, లిస్టింగ్ జూలై 27న జరగనున్నట్లు వెల్లడైంది. గ్రే మార్కెట్‌లో స్టాక్ రూ.12 ప్రీమియంతో ట్రేడవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే రూ.64 వద్ద లిస్ట్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications