Troll: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, USలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే రెండింతల ఎత్తు కలిగిన స్టాట్యూ ఆఫ్ యూనిటీని నిర్మించడంపై నెట్టింట రచ్చ జరుగుతోంది. దాని నిర్మాణం కోసం పెట్టిన పెట్టుబడిపై తక్కువ రాబడి వచ్చినట్లు ఫిన్‌ఫ్లూయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా ట్రోలింగ్‌కు గురవుతోంది.
'స్టాట్యూ ఆఫ్ యూనిటీ ధర: దాదాపు 3 వేల కోట్లు. కొవిడ్‌కు ముందు 2018-2020 మధ్య పార్కింగ్ సహా మొత్తం టిక్కెట్ విక్రయాలు విలువ 116 కోట్లు. దీని ప్రకారం చూస్తే అది 1.2 శాతం ఆకట్టుకునే దిగుబడిని ఇచ్చింది. అంటే పూర్తి పెట్టుబడిని తిరిగి రాబట్టడానికి దాదాపు 80 ఏళ్లు పడుతుంది' అని శ్రీవాస్తవ ట్వీట్ చేశారు.

"పర్యాటకులను ఆకర్షించడానికి విగ్రహ నిర్మాణాలు బాగా పనిచేస్తుంటే, చాలా దేశాలు తమ GDPని పెంచుకోవడానికి ఇదే చేసేవి. ఆర్థిక విశ్లేషణ కూడా తేలికగా సమర్పించవచ్చు. కానీ దురదృష్టవశాత్తు అలాంటి అధ్యయనాలు లేవు" అని ట్వీట్ మరో ట్వీట్ చేశారు. "దేశంలో ఏటా 3 లక్షల మంది పిల్లలు ఆకలితో మరణిస్తున్నారు. అయితే ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం స్మారక కట్టడాలను నిర్మించడానికి ప్రజా ధనాన్ని వినియోగిస్తున్నారు. వారు బతికి ఉంటే విగ్రహాలు నిర్మించమనేవారా లేదా ప్రజలకు ఆహారాన్ని అందించమనేవారో గుర్తించండి" అంటూ ఓ నెటిజన్ పోస్ట్‌పై ఎదురుదాడికి దిగారు.
182 మీటర్ల ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018లో నర్మదా జిల్లాలోని కేవడియా కాలనీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2 వేల 989 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి 42 నెలలు పట్టింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంతో పాటు మరో ఐదు ప్రదేశాలు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడ్డాయి.


Click it and Unblock the Notifications