IT News: కాగ్నిజెంట్‌ జాబ్ పోస్టింగ్‌ నెట్టింట వైరల్.. ఫ్రెషర్లకు ఇచ్చే జీతాలు చూస్తే మతిపోవడం ఖాయం..

Cognizant News: అంతర్జాతీయ IT సేవల సంస్థ కాగ్నిజెంట్ తీసుకుంటున్న నిర్ణయాలపై కంపెనీ ఉద్యోగులే కాకుండా నెటిజన్లు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. పై స్థాయిలోని మేనేజ్‌మెంట్ వందల కోట్లలో జీతాలు తీసుకుంటూ, కింది స్థాయి సిబ్బందికి ఎంగిలి మెతుకులు విసురుతున్నారని సోషల్‌ మీడియాలో ధ్వజమెత్తుతున్నారు.

ఫ్రెషర్స్‌ నియామకాల కోసం కాగ్నిజెంట్ ఆఫర్ చేసిన ప్యాకేజ్‌పై వివాదం నెలకొంది. ఏడాదికి 2.52 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తామని ప్రకటించడంపై సోషల్ మీడియాలో అగ్గిరాజుకుంది. ఈ నేపథ్యంలో సంస్థ CEO రవికుమార్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. భారత్‌లోనే అత్యధిక పారితోషకం తీసుకునే CEOగా ఆయన నిలిచారు. గతేడాది 186 కోట్లు ఆయన సంపాదన. అయితే ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు ఆఫర్ చేస్తున్న జీతాన్ని ఆయన వేతనంతో పోల్చి వైరల్ చేస్తున్నారు.

Netizens fired on Cognizant and it s CEO

52 ఏళ్ల రవి కుమార్ సింఘిశెట్టి జనవరి 2023లో కాగ్నిజెంట్ CEOగా బాధ్యతలు స్వీకరించారు. గతేడాది ఆయనకు ఇచ్చిన వన్-టైమ్ స్టాక్ అవార్డు విలువ 169.1 కోట్లు. దీంతో 2023లో భారత IT పరిశ్రమలో అత్యధిక వేతనం అందుకుంటున్న CEOగా వార్తల్లో నిలిచారు. ఆయన జీతం కాగ్నిజెంట్ ఉద్యోగుల సగటు వేతనం కంటే 556 రెట్లు ఎక్కువ అని గత ఏప్రిల్‌లో నివేదికలు వెలువడ్డాయి. ఈ రేంజ్ CEO సారథ్యంలో నడుస్తున్న కంపెనీలో చేరిన ఫ్రెషర్లకు కేవలం 2.52 లక్షలు చెల్లిస్తున్నారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

IT సేవల ఇండస్ట్రీలోకి 15 ఏళ్ల క్రితం కొత్తగా చేరే వారికి 3.1-3.5 లక్షల వార్షిక వేతనాన్ని చెల్లించేవారు. ఇప్పటికీ ఏమాత్రం పెంపు లేకుండానే అదే మొత్తాన్ని చాలా కంపెనీలు పే చేస్తున్నాయి. దీనిపై ఇటీవల వివాదం చెలరేగింది. ఈ పరిస్థితుల్లో భారతీయుడు రవికుమార్ నేతృత్వంలోని అమెరికన్ కంపెనీ కాగ్నిజెంట్ దానికంటే అతి తక్కువ జీతం ఇవ్వడాన్ని ఇండియన్స్ తట్టుకోలేకపోతున్నారు. పెద్ద నగరాల్లోని వారి ఆఫీసుల్లో పనిచేసేందుకు ఈ మొత్తం ఏ మాత్రం సరిపోదని ఆవేదన వ్యక్తమవుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+