Bengaluru: విమాన టికెట్లతో పోటీ పడుతున్న వందే భారత్ స్లీపర్ టికెట్ల ధరలు..!
బెంగళూరు-ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం అయింది. ఈ ట్రైన్ నవంబర్ 2 నుంచి సాధారణ పౌరులకు అందుబాటులోకి రానుంది. ఆదివారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించారు. 16 కోచ్‌లతో కూడిన ఈ వందే భారత్ స్లీపర్ రైలు, బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) నుంచి బయలుదేరి, సోమవారం ఉదయం 6:15 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (CSMT)కి చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రులు వి. సోమన్న, శోభా కరంద్లాజే, అలాగే పార్లమెంటు సభ్యులు తేజస్వి సూర్య, పి.సి. మోహన్, సి.ఎన్. మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రైలు సాధారణ సేవలు ముంబై-బెంగళూరు మార్గంలో నవంబర్ 2 నుంచి తిరుగు ప్రయాణంలో నవంబర్ 3 నుండి ప్రారంభమవుతాయని నైరుతి రైల్వే తెలిపింది. బెంగళూరు నుంచి ముంబైకి వెళ్లే రైలు నంబర్ 27652, సోమవారాలు తప్ప వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ఇది సాయంత్రం 7:45 గంటలకు SMVT బెంగళూరు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు CSMT ముంబైకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 27651 రాత్రి 8:10 గంటలకు CSMT ముంబై నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం SMVT బెంగళూరుకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ మంగళవారం తప్ప వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది.

ఈ రైలు అనంతపురం, గుంతకల్లు, రాయచూరు, యాద్గిర్, కలబురగి, సోలాపూర్, పూణే మరియు కళ్యాణ్ స్టేషన్లలో ఆగుతుంది. ప్రారంభ ప్రత్యేక రైలు, సాధారణ సేవల్లో ఉండే స్టేషన్లతో పాటు హిందూపూర్, ధర్మవరం, లోనావాలాలలో కూడా ఆగుతుంది. 16 కోచ్‌లతో కూడిన ఈ రైలులో ఎనిమిది మోటార్ కార్ కోచ్‌లు, నాలుగు ట్రైలర్ కార్ కోచ్‌లు ఉన్నాయి. ఈ రైలులో ఏసీ 3-టైర్ (AC 3-Tier), ఏసీ 2-టైర్ (AC 2-Tier), ఏసీ ఫస్ట్ క్లాస్ (AC First Class) మూడు తరగతుల వసతులు అందుబాటులో ఉంటాయి. ఈ రైలులో మొత్తం 823 మంది ప్రయాణీకుల సామర్థ్యం ఉంటుంది. ఇందులో ఏసీ 3-టైర్లో 611 బెర్త్‌లు, ఏసీ 2-టైర్లో 188, ఫస్ట్ ఏసీలో 24 బెర్త్‌లు ఉంటాయి.
ఇక టికెట్ రేట్ల విషయానికొస్తే.. ఏసీ 3-టైర్‌కు రూ. 2,810, ఏసీ 2-టైర్‌కు రూ. 3,630, ఏసీ ఫస్ట్ క్లాస్‌కు రూ. 4,450 గా నిర్ణయించారు. ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ ధరకు ఒక్కోసారి ఫ్లైట్ లో కూడా ప్రయాణించవచ్చని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ ముంబై, బెంగళూరు మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించనుంది. ఈ జర్నీకి దాదాపు 16 గంటలు పట్టే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications