Paid Leaves: ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం అనే మాట మరిచిపోవాల్సిందే. అలాగే ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండే రూల్స్ చాలా క్లిష్టంగా ఉంటాయి. కొన్ని సార్లు అనారోగ్యంగా ఉన్నప్పటికీ.. ఆఫీసులకు, ఉద్యోగాలకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితులు ఎన్నో. మరి కొన్ని కంపెనీల్లో అయితే.. పేరుకే శెలవులు ఉంటాయి, వాటిని వినియోగించుకోవటానికి కంపెనీ యాజమాన్యాలు వీలు కల్పించవు. సిక్ లీవ్, క్యాజువల్ లీవ్, పెయిడ్ లీవ్స్ అంటూ చాలా పేర్లతో సెలవులు ఉన్నాయంటూనే వినియోగించుకోవటానికి మాత్రం NO చెబుతుంటాయి.

కానీ అక్కడ మాత్రం..
అనారోగ్యానికి గురైనప్పుడు కంపెనీ పాలసీ ప్రకారం వినియోగించుకోవటానికి సెలవులు లేకపోతే జీతం విషయం మర్చిపోవాల్సిందే. ఎందుకంటే శాలరీ కట్ చేస్తారు కాబట్టి. అయితే నెదర్లాండ్స్‌లోని ఉద్యోగులకు ఈ టెన్షన్ అస్సలు లేదు. ఎందుకంటే అక్కడ ఎవరైనా ఉద్యోగి అనారోగ్యం కారణంగా సెలవు తీసుకోవాల్సి వస్తే.. అతని జీతంలో 70 శాతాన్ని శెలవులో ఉన్నప్పుడు సైతం పొందుతారు. వారు కోలుకుంటున్న సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఇది అండగా నిలుస్తుంది.

రెండేళ్ల పాటు..
నెదర్లాండ్స్‌లో ఉద్యోగులకు గరిష్ఠంగా రెండు సంవత్సరాల పాటు పెయిడ్ సిక్ లీవ్స్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. పైగా ఉద్యోగి కోలుకున్న తర్వాత వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలి. అనారోగ్యం విషయంలో ఓవర్ టైం, సప్లిమెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సదుపాయం శాశ్వత కాంట్రాక్ట్, ఫిక్స్‌డ్-టర్మ్ కాంట్రాక్ట్, ఆన్-కాల్ ఉద్యోగులకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఉద్యోగి ఈ విషయంలో Work and Income Act కింద ప్రయోజనాలు పొందవచ్చు. దీనిని ఆడిట్ చేయటం జరుగుతుంది. తప్పు చేసినట్లు గుర్తిస్తే.. ప్రభుత్వం డబ్బును వెనక్కి తీసుకుంటుంది.

సిక్ లీవ్ పేమెంట్ రూల్స్..
*అనారోగ్యం వచ్చిన మొదటి ఏడాదిలో ఉద్యోగి సాధారణ జీతంలో 70% పొందుతాడు. మినిమం శాలరీ తక్కువగా ఉంటే కంపెనీ కొంత కలిపి ఇస్తుంది.
* అనారోగ్యంతో రెండవ ఏడాది కూడా 70% జీతం లభిస్తుంది. అదనపు పేమెంట్ లభించదు.
* ఉద్యోగి అవయవ దానం, గర్భం లేదా ప్రసవం కారణంగా అనారోగ్యంతో ఉంటే వారికి 100% జీతం చెల్లించబడుతుంది

జీతం పొందటానికి ఎవరు ఎలిజిబుల్..?
* పర్మినెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు
* ఫిక్స్ డు టర్మ్ ఒప్పందాలు కలిగిన ఉద్యోగులు
* ఆన్-కాల్ ఉద్యోగి

వీరికి జీతం లభించదు..
అనారోగ్య సమయంలో కాంట్రాక్ట్ టెర్మినేట్ అయిన ఉద్యోగులుకు.. ఆ తర్వాత ఎలాంటి జీతం చెల్లించబడదు. సదరు ఉద్యోగి అనారోగ్య ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగి వృద్ధుడై, వృద్ధాప్య పెన్షన్‌కు అర్హులైతే.. కంపెనీ 13 వారాలపాటు జీతంలో 70% చెల్లించాల్సి ఉంటుంది. వికలాంగ ఉద్యోగులు అనారోగ్య సమయంలో ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రెండేళ్లు పూర్తైన తర్వాత వారి ఆరోగ్యం తిరిగి పనిచేసేందుకు సకరించకపోతే జీతం తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.


Click it and Unblock the Notifications