For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెట్‌ఫ్లిక్స్-సుబ్రతా రాయ్ వివాదం... సుప్రీంను ఆశ్రయించనున్న ఓటీటీ దిగ్గజం...

|

'బ్యాడ్ బాయ్స్ మిలియనీర్స్' ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న డాక్యుమెంటరీ వెబ్‌సిరీస్ ఇది. సెప్టెంబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్న ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా నలుగురు ప్రముఖ బిలియనీర్ల చుట్టూ తిరుగుతుంది. ఆ నలుగురు బిలియనీర్లు... విజయ్ మాల్యా,సుబ్రతా రాయ్,నీరవ్ మోదీ,సత్యం రామలింగరాజు. మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న,ఎదుర్కొంటున్న ఈ నలుగురు ఎలా తమ తమ సామ్రాజ్యాలను నిర్మించుకోగలిగారన్నదే ఈ డాక్యుమెంటరీ సిరీస్ కాన్సెప్ట్.

అయితే ఈ సిరీస్‌లో తన పేరును వాడటంపై సహారా ఇండియా ఛైర్మన్ సుబ్రతా రాయ్ బీహార్‌లోని అరారియా కోర్టును ఆశ్రయించారు. దీంతో సుబ్రతా రాయ్ పేరును వాడవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నెట్‌ప్లిక్ బిహార్ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్‌ను సోమవారం(అగస్టు 31) దాఖలు చేయనుంది. దీంతో సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందన్న ఆసక్తి నెలకొంది.

Netflix to move SC against Bihar court order restraining use of Subrata Roys name in Bad Boy Billionaires

కాగా,లండన్‌కి చెందిన ఓ దర్శకుడు 2019లో తనను కలిశాడని సుబ్రతా రాయ్ ఆరోపించారు. తన జీవిత కథ ఆధారంగా వెబ్ ఫీచర్ తెరకెక్కిస్తానని అతను చెప్పాడని... టైటిల్ కూడా 'బిలియనీర్స్' అని తెలిపాడని చెప్పారు. రాయ్ తరుపు న్యాయవాది వివేక్ ఝా మాట్లాడుతూ... ఈ వెబ్ సిరీస్ ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నం అని ఆరోపించారు.

బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి ప్రస్తుతం పరారీలో ఉన్న వజ్రాల వ్యాపిర మెహుల్ చోక్సి కూడా ఈ వెబ్ సిరీస్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్&ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా చోక్సి పిటిషన్‌ను తప్పు పట్టింది. జాతీయ భద్రతకు విఘాతం కలిగించే అంశాలు ఉంటే తప్ప తాము కంటెంట్‌లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

English summary

నెట్‌ఫ్లిక్స్-సుబ్రతా రాయ్ వివాదం... సుప్రీంను ఆశ్రయించనున్న ఓటీటీ దిగ్గజం... | Netflix to move SC against Bihar court order restraining use of Subrata Roy's name in 'Bad Boy Billionaires'

Netflix looks to move the Supreme Court against an order passed by a local court in Bihar, which restrained it from using Sahara India Chairman Subrata Roy's name in its upcoming documentary series Bad Boy Billionaires.
Story first published: Monday, August 31, 2020, 17:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X