Netflix: గతంలో సినిమా చూడాలంటే థియేటర్ కు వెళ్లి, క్యూలైన్లలో నిలబడి, టికెట్ల కోసం తన్నుకోవాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. OTTల ద్వారా ఇంట్లోనే చూసే అవకాశం లభిస్తోంది. కాగా ప్రముఖ OTT ప్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ మరోసారి యూజర్లకు షాక్ ఇవ్వనుంది.
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ తన యూజర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పనున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. మరోసారి సబ్ స్రైబర్లపై భారాన్ని మోపేందుకు సిద్ధమవుతోంది. తన సబ్ స్క్రిప్షన్ ధరలను పెంచే అవకాశాన్ని పరిశీలిస్తోందట. పెరిగిన ధరలను మొదటగా US, కెనడాలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల హాలీవుడ్ సమ్మె సమయంలో ఏర్పడిన ఆదాయ నష్టాలను భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలోనే నెట్ ప్లిక్స్ తన యాడ్-ఫ్రీ స్టాండర్ట్ టైర్ ధరను నెలకు 15.49 డాలర్లు, ప్రీమియం ప్లాన్ ను 19.99కి పెంచింది. అదనంగా 9.99 డాలర్ల బేసిక్ యాడ్-ఫ్రీ ప్లాన్ ను నిలిపివేసి.. దాని స్థానంలో 6.99 డాలర్ల యాడ్-సపోర్టెడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.
ఈ మార్పులతో ఏర్పడిన పాస్‌వర్డ్ షేరింగ్ సమస్యను ఎదుర్కోవడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇతరులతో అకౌంట్ షేరింగ్ కోసం నెలకు అదనంగా 7.99 డాలర్లు వసూలు చేయడం ప్రారంభించింది. కాగా ఈసారి ఎంతమేరకు పెంచనుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇతర ప్లేయర్స్ సైతం ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని అంచనా.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications