A Oneindia Venture

ప్లాస్టిక్ పై సెరిలాక్ కంపెనీ యుద్ధం: రూ 14,000 కోట్ల ఖర్చు!

సెరిలాక్ వంటి చిన్న పిల్లల ఆహార పదార్థాలు తయారు చేసే బహుళ జాతి కంపెనీ నెస్లే... ప్లాస్టిక్ భూతంపై యుద్ధం ప్రకటించింది. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఈ ఎంఎన్ సి సంస్థ ఇకపై తాము వినియోగించే ప్లాస్టిక్ ను గణనీయంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో ఇప్పటికే వినియోగిస్తున్న ప్లాస్టిక్ ను కూడా పూర్తిగా రీసైకిల్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం బిలియన్ డాలర్ల ను ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది. 2025 నాటికీ కంపెనీ వినియోగించే ప్లాస్టిక్ 100% రీసైకిల్ చేయగలిగేలా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఒక ప్రణాళికను రూపొందించుకుని, టార్గెట్ నిర్దేశించుకుంది. నెస్లే కంపెనీ కేవలం సెరిలాక్ వంటి చిన్న పిల్లల ఆహార ఉత్పత్తుల తయారీకి పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారు ఇష్టంగా తినే మ్యాగీ నూడుల్స్ కూడా తయారు చేస్తుంది. అయితే, ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ భూతాన్ని ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇండియా లో కూడా ఇటీవలే సింగల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధించారు. ఈ నేపథ్యంలో తన ఆహార పదార్థాల ప్యాకింగ్ కు అధికంగా ప్లాస్టిక్ పైనే ఆధారపడి నెస్లే... దాని వినియోగాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2 బిలియన్ డాలర్లు ...

2 బిలియన్ డాలర్లు ...

తమ ఉత్పత్తుల ప్యాకింగ్ లో ప్లాస్టిక్ వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని నెస్లే భావిస్తోంది. 2025 నాటికి ఇప్పుడున్న దాంట్లో మూడో వంతుకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో 2025 నాటికీ తాము వినియోగించే 100% ప్లాస్టిక్ పునర్ వినియోగానికి పనికి వచ్చేదై ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఏకంగా 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ 14,000 కోట్లు) కేటాయించింది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా ఏజెన్సీ రాయిటర్స్ ఒక కథనంలో వెల్లడించింది. తాము ప్యాకింగ్ విభాగంలో అతిపెద్ద కంపెనీల్లో ఒకటి కాబట్టి... ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపేందుకు కూడా అదే స్థాయిలో ప్రయత్నం చేస్తున్నామని నెస్లే సీఈఓ మార్క్ స్నిడర్ పేర్కొన్నారు. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ వాడకం కోసం 1.5 బిలియన్ డాలర్లు అధికంగా చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు..

స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు..

ఆహారాన్ని నిలువ చేసే ప్లాస్టిక్ ను తయారు చేసే స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడులకు కూడా నెస్లే సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏకంగా 250 మిలియన్ డాలర్ల ప్రత్యేక ఫండ్ ను కూడా ఏర్పాటు చేసింది. ఫుడ్, ఫుడ్ ప్యాకేజింగ్ విభాగాల్లో పనిచేస్తున్న స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టనుంది. ప్రస్తుతం అమెరికా లో ఈ విభాగంలో చాలా కంపెనీలు పనిచేస్తున్నట్లు నెస్లే గుర్తించింది. అయితే, ఎప్పటి లోగా స్టార్టుప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయనుందో మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

యూనీలీవర్ తో పోటీ..

యూనీలీవర్ తో పోటీ..

ప్రపంచ వ్యాప్తంగా యూనీలీవర్ కంపెనీతో నెస్లే పోటీ పడుతుంది. లండన్ కేంద్రంగా పనిచేసే యూనీలీవర్ కూడా కన్స్యూమర్ ఉత్పత్తుల విభాగంలో ఉన్నప్పటికీ... నెస్లే తో పోల్చితే దాని ప్లాస్టిక్ వినియోగం తక్కువే. ముఖ్యంగా ఫుడ్ విభాగంలో నెస్లే దే ఆధిపత్యం. అందుకే, ఈ మేరకు భారీ ప్రణాళికతో పాటు, అదే స్థాయి బడ్జెట్ తో నెస్లే ముందుకు సాగుతోంది. ఏది ఏమైనా... ప్లాస్టిక్ వినియోగం తగ్గించటం అనేది మంచి విషయమే కదా? మనమూ మన వంతు ప్రయత్నం చేద్దామా మరి?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+