ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఎవరో తెలుసా..? ఖచ్చితంగా మీ ఊహ రాంగ్..
Highest tax payer: దేశంలో కోట్లాది మంది తమ ఆదాయంపై పన్ను చెల్లిస్తూ ఉంటారు. అంబానీ దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఒక ఏడాదిలో 2.5 లక్షలకు పైగా సంపాదించే వారందరూ పన్ను పరిధిలోకి వస్తారు. మరి అందరిలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఇండియా ఎవరా అని ఎప్పుడైనా ఆలోచించారా..? తప్పకుండా మీరు ఊహించిన వారైతే కాదు.
దేశంలోని దిగ్గజ వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా ఏటా భారీ మొత్తంలో పన్ను చెల్లిస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ పారిశ్రామికవేత్తలను సైతం వెనక్కి నెడుతూ, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అత్యధిక ట్యాక్స్ పేయర్ గా రికార్డు సృష్టించారు. 2021-22 ఆర్థిక ఏడాదికి గాను ఆయన ఈ ఫీట్ సాధించారు.

ఆదాయపు పన్ను శాఖ డేటా ప్రకారం.. 2022లో అక్షయ్ కుమార్ దేశంలోనే అత్యధికంగా ట్యాక్స్ పే చేశారు. ఆయం సంవత్సర ఆదాయం 486 కోట్లు కాగా ఏకంగా 29.5 కోట్ల ఆదాయపు పన్ను డిపాజిట్ చేశారు. అంతకు ముందు ఏడాది కూడా 25.5 కోట్ల ఇన్ కమ్ ట్యాక్స్ కట్టారు. సినిమాలే కాకుండా ఆయనకు సొంత ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్ ఉన్నాయి. వివిధ బ్రాండ్లకు అంబాసిడర్ గానూ పనిచేశారు. తద్వారా భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి వచ్చింది.

ఏటా వేలకోట్లు సంపాదించే దిగ్గజ పారిశ్రామికవేత్తలు కాకుండా హీరో అక్షయ్ కుమార్ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ కావడం ఏమిటన్ డౌట్ వస్తుందా..? ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటాల సంపాదన వారి వ్యక్తిగతం కాదు అదంతా వారి కంపెనీల పేరిట ఉంటుంది. అందుకే వారు సాధారణ ఆదాయపు పన్నుకు అదనంగా భారీ మొత్తంలో కార్పొరేట్ ట్యాక్స్ పే చేస్తారు.


Click it and Unblock the Notifications