Stock Markets: దాదాపు 2% ఆత్మహత్యలకు స్టాక్ మార్కెట్లే కారణం.. అధ్యయనంలో చేదు నిజాలు.. కానీ..
Markets suicides: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలు వస్తాయి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. భారీ నష్టాలను మూటగట్టుకుని సతమతం అవుతున్నవారు ఎందరో ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎటూ పాలుపోని స్థితిలో కొందరు కొట్టుమిట్టాడుతున్నారు.
లాభనష్టాలను పక్కనపెడితే స్టాక్ మార్కెట్ మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మార్కెట్ ఎంత అల్లకల్లోలంగా ఉంటే పార్టిసిపెంట్స్‌కు అంత స్థాయిలో గుండెపోటు, పక్షవాతం మరియు ఆత్మహత్యలకు సంబంధించిన ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు చైనాలోని ఫుడాన్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది.

ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్టాక్ మార్కెట్ అయిన చైనాలో 2013 నుంచి 2019 మధ్యకాలంలో 12 మిలియన్లకు పైగా మరణాలను ఈ యూనివర్సిటీ విశ్లేషించింది. వారిలో సంస్థాగత పెట్టుబడిదారులతో పోలిస్తే రిటైల్ ఇన్వెస్టర్లు అధిక సంఖ్యలో ఉన్నట్లు నిర్దారించింది. ఓ ప్రముఖ చైనీస్ స్టాక్ ఇండెక్స్‌లో కేవలం 1 శాతం తగ్గుదల.. గుండెపోటు మరియు స్ట్రోక్‌ల వల్ల మరణాలలో 0.74-1.04 శాతం మరియు ఆత్మహత్యలలో 1.77 శాతం పెరుగుదలకు సమానమని గుర్తించింది.
మరో ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే ఈ తరహా ప్రవర్తన కేవలం మార్కెట్లు పతనమైనప్పటికి మాత్రమే పరిమితం కాదు. మార్కెట్లు అకస్మాత్తుగా లాభపడినప్పుడు కూడా ఇదే విధమైన దృగ్విషయాన్ని విశ్లేషకులు నోటీస్ చేశారు. ఈ శైలి భారీ మార్కెట్ క్రాష్ లేదా బుల్ రన్ సమయాల్లోనే కాకుండా రోజువారీ హెచ్చుతగ్గుల విషయంలోనూ చూస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే సదరు డేటా చైనీస్ మార్కెట్లపై అధ్యాయన ఫలితం కావడంతో ఇతర దేశాల పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications