జనవరి 2020లో మొత్తం 16 బ్యాంకు సెలవు రోజులు! ఎక్కడెక్కడ అంటే?
జనవరి నెలలో బ్యాంకు ఉద్యోగులకు ఎక్కువ సెలవులు ఉన్నాయి. 2020 జనవరి నెలలో బ్యాంకులతో పనులు ఉన్న కస్టమర్లు ఆయా బ్యాంకుల సెలవు రోజులను చూసుకొని, బ్యాంకులను సందర్శించడం మంచిది. 2020లో మొదటి నెలలోనే బ్యాంకులకు దాదాపు 16 సెలవులు ఉన్నాయి. ఇందులో సాధారణ సెలవులతో పాటు ఇతర సెలవులు ఉన్నాయి.
అయితే ఆయా ప్రాంతాలు, బ్యాంకులను బట్టి సెలవులు తగ్గుతాయి. మొత్తంగా ఎక్కువ బ్యాంకులకు దాదాపు 10 రోజులకు పైగా సెలవు రోజులు ఉన్నాయి. బ్యాంకులు ఆదివారాలు, అలాగే, రెండో, నాలుగో శనివారం క్లోజ్ అవుతాయి. జనవరిలో 4 ఆదివారాలు, రెండు శనివారాలు క్లోజ్ అవుతాయి. వివిధ పండుగలకు కూడా సెలవులు ఉంటాయి.

- జనవరి 1, కొత్త సంవత్సరం
- జనవరి 2, గురుగోవింద్ సింగ్ జయంతి
- జనవరి 5, ఆదివారం
- జనవరి 7 ఇమోయిను ఇరత్పా (ఇంఫాల్)
- జనవరి 8, గాన్‌ఘాయి
- జనవరి 11, రెండో శనివారం
- జనవరి 12 ఆదివారం
- జనవరి 14 మకర సంక్రాంతి (అహ్మదాబాద్)
- జనవరి 15, ఉత్తరాయణ మకర సంక్రాంతి, పొంగల్, (చెన్నై, గౌహతి, హైదరాబాద్, అమరావతి తదితర ప్రాంతాల్లో సెలవు)
- జనవరి 16, తిరువల్లూర్ డే (చెన్నై)
- జనవరి 17 ఉజావర్ తిరునాల్ సెలబ్రేషన్స్ (చెన్నై)
- జనవరి 19, ఆదివారం
- జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (కోల్‌కతా, అగర్తాల)
- జనవరి 25, నాలుగో శనివారం
- జనవరి 26
- జనవరి 30, సరస్వతిపూజ, వసంత పంచమి


Click it and Unblock the Notifications