For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bugatti: రూ.100 కోట్ల కారు: మైండ్ బ్లాక్ చేసే ఫస్ట్‌ లుక్: స్పెసిఫికేషన్స్ ఇవే

|

పారిస్: ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత కార్ల తయారీ కంపెనీ బుగాటి.. అనుకున్నది సాధించింది. 100 కోట్ల రూపాయల విలువ చేసే కారును దానికి అనుగుణమైన స్పెసిఫికేషన్స్‌తో తయారు చేస్తామని ప్రకటించిన ఆ కంపెనీ చెప్పింది చేసి చూపించింది. 100 కోట్ల రూపాయల ధర పలికే కారును రూపొందించింది. దాని ఫైనల్ వర్షన్‌కు చెందిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. లగ్జరీ కార్ల తయారీ సంస్థగా, అత్యంత ఖరీదైన కార్లను రూపొందించే కంపెనీగా ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో గుర్తింపు పొందిన బుగాటి.. ఈ కారును ఎప్పుడు మార్కెట్‌లోకి విడుదల చేస్తుందా అనే ఉత్కంఠతను రేకెత్తించింది.

65 వేల ఇంజినీరింగ్ వర్కింగ్ అవర్స్..

ఈ కారు పేరు లా వొయిచర్ నొయిరె (La Voiture Noire). ఫ్రెంచ్ భాషలో బ్లాక్ కలర్ కారు అని అర్థం. దీనికి తగ్గట్టుగానే మిడ్ నైట్ బ్లాక్ కలర్‌లో మిళమిళ మెరుస్తూ కనిపించిందా కారు. బుగాటి నుంచి వెలువడిన ఈ బ్యూటీ కారు ధర అక్షరాలా 13.4 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీతో కంపేర్ చేస్తే సుమారుగా 100 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఆన్ రోడ్ మీదికి వచ్చేసరికి దీని ధర 18.90 డాలర్లకు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఈ కారును తయారు చేయడానికి బుగాటి కంపెనీకి 65 వేల ఇంజినీరింగ్ వర్కింగ్ అవర్స్ పట్టింది. అద్భుతమైన ఫీచర్లతో డిజైన్ చేసిన ఈ కారు ఆల్‌రెడీ అమ్ముడుపోయింది కూడా.

 2019లో తొలిసారిగా..

2019లో తొలిసారిగా..

2019లో జెనీవాలో నిర్వహించిన ఆటో షోలో బుగాటీ కంపెనీ తొలిసారిగా లా వొయిచర్ నొయిరె మోడల్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. తొలి మోడల్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు తదుపరి మోడల్‌ను సెంటొడిసి పేరుతో తయారు చేస్తున్నారు. ఈ ఏడాది ముగింపులో ఈ మోడల్‌ను సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఈ మోడల్‌ను ఆటో షోలో ప్రదర్శనకు ఉంచినప్పుడే.. దీనికి సంబంధించిన ఆర్డర్లు అందినట్లు బుగాటి వెల్లడించింది. ఆ తరువాతే ఈ హైపర్ మ్యానుఫ్యాక్చర్‌ను మొదలు పెట్టినట్టు స్పష్టం చేసింది.

 స్పెసిఫికేషన్స్ ఇవే..

స్పెసిఫికేషన్స్ ఇవే..

ఈ కారులో అన్నీ ప్రత్యేకతలే. 16 సిలిండర్లు, నాలుగు టర్బోఛార్జర్లతో ఇది తయారైంది. 1,500 హార్స్‌పవర్ దీని సొంతం. అలాగే 1,18 ఎల్బీ-ఎఫ్టీ టార్క్‌ను కలిగి ఉంటుంది. మిస్టరీ బయ్యర్ ఒకరు 19,000,000 డాలర్లతో దీన్ని కొనుగోలు చేసినట్లు తేలింది. బుగాటి కంపెనీ స్థాపించిన 110 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కారును తయారు చేసినట్లు బుగాటి ఆటోమొబైల్స్ అధినేత, జర్మనీకి చెందిన స్టెఫాన్ వింకెల్‌మన్ చెప్పారు. ఇలాంటి మరిన్ని అధునాతన డిజైన్లతో కూడిన కార్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వివిధ దేశాల నుంచి ఈ కొత్త కారు కోసం బుగాటికి ఆర్డర్లు అందినట్లు ఫ్రాన్స్ మీడియా పేర్కొంది.

Read more about: cars
English summary

Bugatti: రూ.100 కోట్ల కారు: మైండ్ బ్లాక్ చేసే ఫస్ట్‌ లుక్: స్పెసిఫికేషన్స్ ఇవే | Near Rs 100 Crore Price: Bugatti La Voiture Noire Final Version Unveiled

Bugatti has revealed its latest offering La Voiture Noire. The fancy machine that costs $13.4 million took as many as 65,000 engineering hours to get completed. The upcoming offering is based on the Bugatti Chiron.
Story first published: Saturday, June 5, 2021, 16:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X