NDTV Share: ఎన్డీటీవీని సొంతం చేసుకుంటున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించటంతో NDTV షేర్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. నిన్న ట్రేడింగ్ సమయంలో స్టాక్ అప్పర్ సర్యూట్ తాకింది. మెుత్తానికి స్టాక్ తన 14 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే ప్రస్తుతం షేర్ విలువ పడిపోయే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ఎగబడుతున్నారు.

వరుసగా అప్పర్ సర్యూట్స్..
NDTV షేర్లు ఈరోజు అంటే గురువారం కూడా అదానీ గ్రూప్ కొనుగోలు వార్తల మధ్య భారీగా పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో బుధవారం అప్పర్ సర్క్యూట్‌లో రూ.388.20 వద్ద ముగిసింది. అయితే స్టాక్ లో బుల్ జోరు నేడు కూడా అలాగే కొనసాగింది. ఈ రోజు ఉదయం కూడా పెరగడంతో రూ.407.60కి చేరుకుంది.

ఏడాది నుంచి 400 శాతం రాబడి..
గత ఏడాది కాలంలో NDTV షేరు 442 శాతం లాభపడింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇది 254 శాతం పెరిగింది. అదానీ కొనుగోలు వార్తలు రావటంతో షేర్ ఏకంగా రెండిందలు పెరిగింది. గత 5 ఏళ్లలో 933 శాతం రాబడిని అందించింది.

ప్రమోటర్ల అంగీకారం లేకుండానే..
అదానీ గ్రూప్ ఇటీవలే తన స్వంత మీడియా కంపెనీ అయిన AMG మీడియా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. NDTV షేర్లను అదే AMG మీడియా నెట్‌వర్క్‌ల అనుబంధ సంస్థ అయిన విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేయబోతోంది. కంపెనీ 12 సంవత్సరాల క్రితం NDTV ప్రమోటర్ కంపెనీ అయిన RRPR హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రుణం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి బదులు షేర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే తమ అంగీకారం తీసుకోకుండానే అదానీ గ్రూప్ ఏకపక్షంగా వ్యవహరించిందంటూ ప్రమోటర్లు పెదవి విరిచారు.

సెబీకి సమాచారం..
ఈ డీల్ కుదరక ముందే కొత్త రికార్డులు సృష్టిస్తున్న NDTV షేర్లకు బ్రేక్ పడవచ్చు. గౌతమ్ అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ కూడా లాంచ్ చేస్తామని చెప్పింది. తద్వారా 26 శాతం వాటాను ఎక్కువగా కొనుగోలు చేయవచ్చు. అయితే.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డుకి పంపిన నోటీసులో ఎన్‌డీటీవీ కొనుగోలు గురించి తమకు తెలియజేయలేదని పేర్కొంది. దీనికి సంబంధించి ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ నుంచి ఎటువంటి చర్చ లేదా సమ్మతి తీసుకోలేదు. NDTVలో రాయ్ దంపతులకు 32.26 శాతం వాటా ఉంది.

డీల్ లేటయ్యే అవకాశం.. ఇన్వెస్టర్లకు నష్టమా..?
అదానీ పరోక్షంగా NDTVని హస్తగతం చేసుకోవటంపై ప్రమోటర్లు సంతోషంగా లేరు. ఈ కారణంగా డీల్ పూర్తి కావటానికి ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి.. సెబీ ఆర్డర్ వాటాలను బదిలీ చేయకుండా నిరోధించిందని ప్రమోటర్లు అంటున్నారు. ఇది NDTV షేర్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం గరిష్ఠాల వద్ద షేర్ ట్రేడవుతున్న సమయంలో కొనేవారు నష్టపోయే ప్రమాదం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications