Sahara News: అమ్మకానికి సహారా గ్రూప్ కంపెనీ.. NCLT గ్రీన్ సిగ్నల్..
Sahara Group: ఇటీవల సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణం తర్వాత కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారి భవితవ్యం, ఇతర చట్టపరమైన పరిష్కారాలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
సహారా గ్రూప్ అనుబంధ సంస్థపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దివాలా చర్యలకు ఆదేశించింది. సహారా క్యూ షాప్ యూనిక్ ప్రొడక్ట్స్ రేంజ్ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్‌కు బకాయిలు చెల్లించడంలో డిఫాల్ట్ చేసిందని జస్టిస్ కిషోర్ వేములపల్లి నేతృత్వంలోని ట్రిబ్యునల్ ముంబై బెంచ్ పేర్కొంది. సహారా క్యూ షాప్ 2012లో వినియోగదారు ప్యాకేజీ వస్తువులు, రిటైల్ వ్యాపారంగా ప్రారంభించబడింది.

దివాలా కోడ్ కింద ఈ కేసు ఆమోదయోగ్యమైనదని ఎన్సీఎల్టీ అభిప్రాయపడింది. సహారా గ్రూప్ కంపెనీ రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఉదయకుమార్ భాస్కర్ భట్‌ను మధ్యంతర రిజల్యూషన్ లేదా ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్‌గా ట్రిబ్యునల్ నియమించింది. సిగ్మా సప్లై చైన్ IBC కింద డిసెంబరు 2021లో సెక్షన్- 9 దరఖాస్తును దాఖలు చేసింది.
సహారా.. క్యూ షాప్‌కు రూ.4.75 కోట్లు బకాయిపడింది. దీంతో కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలను ప్రారంభించాలని కోరింది. అయితే సహారా క్యూ షాప్ తరపు న్యాయవాది సిగ్మా సప్లై చైన్ పిటిషన్ చట్టపరంగా సమర్థనీయం కాదని, దానిని కొట్టివేయడానికి అర్హమని వాదించారు. NCLT తన ఆర్డర్‌లో సహారా గ్రూప్ కంపెనీ భారతదేశంలోని కంపెనీ గిడ్డంగుల్లో వస్తువుల నిర్వహణ, నిల్వ, పరిపాలన, పంపిణీ అరేంజ్మెంట్స్ కోసం సిగ్మా సప్లై చైన్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.


Click it and Unblock the Notifications