Reliance: రిలయన్స్ గ్రూపు సంస్థలన్నీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఒకే గొడుగు కింద స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. జియోను వేరుగా లిస్ట్ చేసేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఈ విషయంపై కంపెనీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి రిలయన్స్ డీ మెర్జర్ కు ఆమోదం లభించినట్లు సంస్థ తెలియజేసింది. తద్వారా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ IPOకు మార్గం సుగమమైంది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఈ లిస్టింగ్ పై ప్రైమరీ, సెకండరీ మార్కెట్లలో విపరీతమైన క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది.

డీమెర్జర్ రికార్డు తేదీ, ఈక్విటీ షేర్ల కేటాయింపు సహా ఇతర వివరాలపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని రిలయన్స్ వెల్లడించింది. అయితే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ల లిస్టింగ్ ధరపై పలు సంస్థలు ఇప్పటికే అంచనా వేశాయి. 179గా ఉండనుందని జెఫరీస్ భావిస్తోండగా, 189 వద్ద లిస్ట్ అవుతుందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ JP మోర్గాన్ పేర్కొంది.
సెప్టెంబరులోపు డీమెర్జర్ రికార్డు తేదీ ఉండవచ్చని ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెచ్ అవినాష్ గోరక్షకర్ అభిప్రాయపడ్డారు. అనంతరం మరో నెలలోగా షేర్ లిస్టింగ్ ఆశించవచ్చన్నారు. ఈ డీమెర్జర్ అర్హత కలిగిన వాటాదారులకు.. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే ఓ మెగా డీల్ కానుందని భావిస్తున్నట్లు చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications