కుప్పకూలిన దిగ్గజ స్టాక్.. ఇప్పుడు దివాలాకు NCLT గ్రీన్ సిగ్నల్, మీకూ షేర్లున్నాయా..??
Coffee Day Enterprises: దేశీయ స్టాక్ మార్కెట్లో మార్కెట్లు ఒకపక్క బుల్ జోరును కొనసాగిస్తుంటే మరోపక్క కాఫీ వ్యాపారంలో ఉన్న సంస్థ స్టాక్ మాత్రం పతనం అయింది. దీనికి తోడు కంపెనీ షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ గురించే. వాస్తవానికి గత శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడినప్పటికీ కొన్ని కంపెనీల షేర్లలో పెద్ద పతనం కనిపించింది. ఈ క్రమంలోనే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ స్టాక్ 5 శాతం పడిపోయి ఒక్కోటి కనిష్టంగా రూ.46.63కి చేరుకున్నాయి. అయితే తాజాగా కంపెనీపై దివాలా ప్రక్రియకు అనుమతిస్తూ NCLT గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కంపెనీ కాఫీ డే గ్రూప్ కాఫీ హౌస్‌ల కేఫ్ కాఫీ డే పేరుతో చైన్‌ను నిర్వహిస్తోంది.

వాస్తవానికి కాఫీ డే గ్రూప్ మాతృ సంస్థ అయిన కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(CDEL)పై దివాలా చర్యలను ప్రారంభించాలని కార్పొరేట్ వివాదాల ట్రిబ్యునల్ NCLT ఆదేశించింది. IDBI ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంగళూరు బెంచ్ ఆగస్టు 8న స్వీకరించింది. రూ.228.45 కోట్ల రుణ డిఫాల్ట్‌తో అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీ కార్యకలాపాలను చూసేందుకు మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ని నియమించాలని విజ్ఞప్తి చేసింది.
కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే ఒక రిసార్టును కలిగి ఉంది. అలాగే కన్సల్టెన్సీ సేవలను అందించడంతో పాటు కాఫీ గింజల వ్యాపారంలో ఉంది. CDEL రీడీమ్ చేయదగిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల కూపన్ చెల్లింపుపై డిఫాల్ట్ చేసింది. ఆర్థిక రుణదాత ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా 1,000 ఎన్‌సిడిల కోసం సబ్‌స్క్రయిబ్ చేసింది. వీటికి సంబంధించి మార్చి 2019లో సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.100 కోట్లు చెల్లించారు. దీని కోసం CDEL IDBITSLతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2020లో మొత్తం కూపన్ చెల్లింపులను చెల్లించడంలో డిఫాల్ట్ కావటంతో డిబెంచర్ ట్రస్టీ అన్ని డిబెంచర్ హోల్డర్ల తరపున 2020 జూలై 28న CDELకి డిఫాల్ట్ నోటీసును జారీ చేసి NCLTని తరలించింది. అయితే తాజాగా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.


Click it and Unblock the Notifications