Reliance News: 2016లో టెలికాం వ్యాపారంలోకి అడుగుపెట్టిన ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో అతిపెద్ద మ్యాజిక్ చేసింది. మార్కెట్లోని ఇతర వ్యాపారులు కనుమరుగయ్యేలా చేసింది. ఉచితాలతో ఆకట్టుకుని కస్టమర్లను సముపార్జించింది. అయితే ప్రస్తుతం కంపెనీ ఇదే స్టాటజీనికి మీడియా వ్యాపారంలోనూ కొనసాగిస్తోంది. జియో దెబ్బకు ప్రపంచ దిగ్గజ సంస్థ డిస్నీ సైతం తన వ్యాపారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితికి దిగజారింది.
చాలా కాలంగా రిలయన్స్ మీడియా విభాగం వయాకామ్ 18, అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ మధ్య కొనుగోలుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఒప్పందానికి నేషనల్ లా ట్రైబ్యునల్ ముంబై శాఖ నుంచి కీలక అనుమతులు లభించాయి. దీంతో రిలయన్స్ వయాకామ్ 18, వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియా కలయికకు పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ అయ్యింది. విలీన పథకానికి ఆమోదం పొందేందుకు వారి సురక్షితమైన, అసురక్షిత రుణదాతలతో సమావేశాలు నిర్వహించమని కోరింది.

విలీన ప్రక్రియ రెండు దశల్లో కొనసాగనుంది. మెుదటగా వయాకామ్ 18 ఆస్తులను డిజిటల్ 18కి బదలాయింపు జరుగుతుంది. దీని తర్వాత వీటిని స్టార్ ఇండియా కోసం డీమెర్జర్ చేయబడతాయి. దీని తర్వాత ఏర్పడే కొత్త సంస్థకు ఏకంగా దేశంలో 100 టీవీ ఛానల్స్, రెండు స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్‌లు ఉండనున్నాయి. ప్రస్తుతం డిస్నీ+ హాట్ స్టార్, జియో సినిమాలకు దాదాపు 750 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. మెర్జర్ తర్వాత సంయుక్తంగా ఏర్పడే సంస్థ మార్కెట్ విలువ రూ.70,352 కోట్లు లేదా 8.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. కొత్తగా ఏర్పడే మీడియా దిగ్గజ సంస్థకు నీతా అంబానీ ఛైర్ పర్సన్, ఉదయ్ శంకర్ వైస్ చైర్ పర్సన్ గా వ్యవహరించనున్నారు.
వాస్తవానికి దీనికి ముంది దేశంలో సోనీ-జీ సంస్థల మెర్జర్ ప్రక్రియ కొనసాగాల్సి ఉన్నప్పటికే గడువులోగా అది పూర్తి కాకపోవటంతో రద్దు చేయబడింది. అయితే ఈ రద్దుతో దేశంలోని మీడియా వ్యాపారంలో అంబానీకి పెద్ద అడ్వాన్టేజ్ ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో 28 బిలియన్ డాలర్ల మీడియా వ్యాపారంలో అంబానీ కీలక పాత్ర పోషించనున్నారు. వాస్తవానికి జియో క్రికెట్ మ్యాచ్ లను ఉచితంగా స్ట్రీమ్ చేయటంతో.. భారతదేశంలో డిస్నీ స్ట్రీమింగ్ సర్వీసెస్ పెద్ద సంఖ్యలో చందాదారులను కోల్పోయిన సంగతి తెలిసిందే. రిలయన్స్ ప్లాట్‌ఫారమ్ నుంచి గట్టి పోటీని ఎదుర్కోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంది. ఫలితంగా డిస్నీ ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునేందుకు స్మార్ట్‌ఫోన్‌లలో ఉచిత క్రికెట్ స్ట్రీమింగ్‌ను అందించాల్సి వచ్చింది. చివరికి పోటీలో నిలవలేక తిరిగి అంబానీ చేతికే తన వ్యాపారాన్ని విక్రయిస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications