GoFirst: బ్రిటానియా ఇండస్ట్రీస్ యజమాని వాడియా గ్రూప్ నేతృత్వంలోని బడ్జెట్ విమాన సంస్థ గోఫస్ట్ డబ్బు కొరతతో గ్రౌండ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీ స్వచ్చందంగా దివాలా ప్రక్రియ కోసం కంపెనీ లా ట్రిబ్యునల్ ను అభ్యర్థించింది.
గోఫస్ట్ దివాలా చర్యలకు NCLT అంగీకరించటంతో విమాన అద్దెదారులు అప్పిలేట్ ట్రిబ్యునల్ తలుపు తట్టారు. అయితే ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్లు ఎన్సీఎల్ఏటీ వెల్లడించింది. దీంతో విమాన అద్దెదారులు తమ విహంగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. దీనికి ముందు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) మే 10న ఎయిర్‌లైన్ స్వచ్ఛంద అభ్యర్థన దివాలా పరిష్కార ప్రక్రియను అంగీకరించింది.

దివాలా ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అభిలాష్ లాల్ క్యారియర్ మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా నియమించబడ్డారు. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న గో ఫస్ట్ మే 3 నుంచి విమానాలను నడపటం నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు టికెట్ బుకింగ్ చేయవద్దని డీజీసీఏ తాత్కాలికంగా నిషేధం విధించింది. అయితే వాడియా గ్రూప్ మాత్రం విమాన సేవలకు కట్టుబడి ఉందని త్వరలోనే గ్రౌండ్ అయిన విమానాలను తిరిగి సేవల్లోకి తీసుకొస్తామని కంపెనీ సీఈవో గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
నిర్వహణ కారణాలతో మే 26, 2023 వరకు విమాన సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కంపెనీ అధికారిక మాధ్యమాల్లో వెల్లడించింది. ఇప్పటి వరకు విమాన టిక్కెట్లు కొన్న వారికి ఒరిజినల్ పేమెంట్ మోడ్ ద్వారా డబ్బును పూర్తిగా రీఫండ్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. అలాగే త్వరలోనే విమానాల బుక్కింగ్స్ తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించింది. గో ఫస్ట్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్(CIRP) కోసం క్లెయిమ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ 'gofirstclaims.in/claims' ప్రారంభించబడింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications