ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) పెట్టుబడిదారులకు చక్ర వడ్డీ ద్వారా సంపదను సురక్షితంగా, రిస్క్ ఫ్రీ గా పెంచుకునేందుకు ఒక మంచి ఆర్థిక సాధనంగా చెప్పుకోవాలి. ఇప్పటికీ మన ముందు తరం వాళ్లు ఎక్కువగా డబ్బు పొదుపుకోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లనే మెుదటి ఆప్షన్ గా ఎంచుకుంటుంటారు. ఎందుకంటే ఇతర పెట్టుబడి సాధనాలకంటే తక్కువ వడ్డీ వచ్చినప్పటికీ.. వారికి FDలపైనే ఎక్కున నమ్మకమని చెప్పుకోవాలి. FD పెట్టుబడి సౌకర్యాన్ని కేవలం బ్యాంకులు మాత్రమే కాకుండా కార్పొరేషన్‌లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లు (NBFC) కూడా అందిస్తున్నాయనే విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదనటంలో ఆశ్చర్యం అక్కర్లేదు. దేశంలో చాలా మందికి ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవటం కూడా ఇందుకు కారణంగా నిలుస్తోంది. ఈ క్రమంలో దేశంలోని అనేక NBFCలు తమ వద్ద చేసే FD పెట్టుబడులకు మంచి రిటర్న్స్ అందిస్తు్న్నాయి.

FDలపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్న NBFCల వివరాలు:
శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కో లిమిటెడ్ తమ వద్ద చేసే FD పెట్టుబడులకు ఏడాదికి 6.31 శాతం నుంచి 7.62 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ కో లిమిటెడ్ ఏడాదికి 6.31 శాతం నుం 7.62 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏడాదికి 6.25 శాతం నుంచి 7.25 శాతం వడ్డీని ఇస్తోంది. ఇదే క్రమంలో కేరళ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ తమ వద్ద చేసే ఎఫ్‌డి పెట్టుబడులకు ఏదాదికి 5.75 శాతం నుంచి 6 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. PNB హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏడాదికి 5.75 శాతం నుంచి 7 శాతం వడ్డీని FD పెట్టుబడులకు చెల్లిస్తోంది.

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వడ్డీ ఎంతిస్తుందంటే..
ఫైనాన్స్ రంగంలో అందరికీ సుపరిచితమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏడాదికి 5.75 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది. బ్యాంకింగ్ దిగ్గజానికి సంబంధించిన HDFC Ltd 5.65 శాతం నుంచి 6.70 శాతం వడ్డీని ఏడాదికి అందిస్తోంది. సుందరం హోమ్ ఫైనాన్స్ ఏడాదికి 5.50 శాతం నుంచి 6.05 శాతం వరకు తమ కస్టమర్ల ఎఫ్ డీలకు చెల్లిస్తోంది. ICICI హోమ్ ఫైనాన్స్ సంవత్సరానికి 5.25 శాతం నుంచి 6.8 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. చివరిగా ఎల్ఐసీకి చెందిన LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏడాదికి 5.60 శాతం నుంచి 6.60 శాతం వరకు FD పెట్టుబడులకు చెల్లిస్తున్నాయి.

FDని పునరుద్ధరించినప్పుడు అదనపు వడ్డీ రేటు..
అదనంగా.. వీటిలో కొన్ని NBFCలు మెచ్యూరిటీపై FDని పునరుద్ధరించినప్పుడు అదనపు వడ్డీ రేటు బోనస్‌ను కూడా అందిస్తాయి. సీనియర్ సిటిజన్లు తమ FDలపై అదనంగా 0.25-0.50 శాతం బోనస్ వడ్డీ రేట్లను కూడా పొందవచ్చు. NBFCలు సాధారణంగా అధిక వడ్డీ రేట్లను అందజేస్తున్నప్పటకీ.. వాటి FDలు తక్కువ లిక్విడ్‌గా ఉంటాయి. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) అందించిన రూ. 5 లక్షల గ్యారెంటీ పరిధిలోకి NBFCలు రావని వినియోగదారులు గమనించాలి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications