లిస్ట్ అయిన తొలి రోజే నజారా టెక్నాలజీస్ ఈ ఉదయం స్టాక్ ఎక్సేంజ్ లో దుమ్ము రేపింది . క్యాండీ క్రష్ , సబ్వే సర్ఫస్ , టెంపుల్ రన్ వంటి ప్రముఖ మొబైల్ గేమ్స్ రూపొందించిన నజారా టెక్నాలజీ షేర్లు స్టాక్ మార్కెట్లో 80 శాతం ప్రీమియం తో లిస్ట్ అయ్యాయి. నజారా టెక్నాలజీస్ ఈ ఉదయం స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయిన తర్వాత ఊహించని విధంగా షేర్ల ధర పెరిగింది.

స్టాక్ మార్కెట్ లో నజారా టెక్నాలజీస్ షేర్లు తొలిరోజు ట్రేడింగ్ ఇలా
నజారా టెక్నాలజీస్ షేర్లు బిఎస్ఈ లో తొలిరోజు 1,971 రూపాయల వద్ద ప్రారంభమయ్యాయి. ఇది ప్రీమియం 79.02 శాతం, ఇష్యూ ధర 1,101 తో పోలిస్తే దాదాపు 80 శాతం ప్రీమియంతో ట్రేడ్ అయ్యాయి. ఓ దశలో 24 శాతం ఎగసి 2026 వద్ద నజారా టెక్నాలజీస్ ట్రేడ్ అయింది . ఇక నిఫ్టీలో ఈ కంపెనీ షేర్లు 1990 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఎక్స్ఛేంజీలలో డేటా ప్రకారం, పబ్లిక్ ఆఫర్ 175.46 శాతం సబ్ స్క్రైబ్ చేయబడింది. రిటైల్ పెట్టుబడిదారుల కోసం కేటాయించిన భాగం 75.29 శాతం, సంస్థేతర పెట్టుబడిదారుల భాగం 39.89 శాతం సబ్ స్క్రైబ్ అయ్యింది.

ఇండియాలో మొబైల్ గేమ్స్ రూపొందిస్తున్న సంస్థలలో ముందు వరుసలో నజారా టెక్నాలజీస్
అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల విభాగం 103.77 సభ్యత్వాన్ని ఆకర్షించింది. నజారా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ద్వారా 3,583 కోట్ల రూపాయలను సమీకరించింది . ఇది వాటాదారుల అమ్మకం కోసం నజారా టెక్నాలజీస్ ఇచ్చిన ఆఫర్ . నజారా టెక్నాలజీస్ భారతదేశంలో ముంబై కేంద్రంగా 1999లో ప్రారంభమైంది. భారత్లో మొబైల్ గేమ్స్ రూపొందిస్తున్న సంస్థలలో ఇది ముందువరుసలో ఉంది. నజారా టెక్నాలజీస్ వివిధ విభాగాలలో పనిచేస్తుంది.

నజారా టెక్నాలజీస్ భవిష్యత్తులో మంచి లాభాలను ఆర్జించే అవకాశం
వీటిలో సబ్ స్క్రైబ్ -ఆధారిత వ్యాపారం, ఈ స్పోర్ట్స్, గామిఫైడ్ ప్రారంభ అభ్యాసం మరియు మనీ గేమింగ్ ఉన్నాయి. ఇది భారతదేశం అంతటా మరియు ఆఫ్రికా మరియు ఉత్తర అమెరికా వంటి ప్రపంచ మార్కెట్లలో ఉనికిని కలిగి ఉంది. నజారా టెక్నాలజీస్‌కు షేర్ మార్కెట్ బిగ్ బుల్ గా పేరుగాంచిన రాకేష్ ఝన్ ఝన్ వాలాకు ఈ కంపెనీలో 11.51శాతం వాటా ఉంది. భారతదేశంలో భవిష్యత్తులో గేమింగ్ పరిశ్రమకు మంచి భవిష్యత్ ఉందని నిపుణులు భావిస్తున్న సమయంలో గేమింగ్ పరిశ్రమలో ముందు వరుసలో ఉన్న నజారా టెక్నాలజీస్ భవిష్యత్తులో మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉందని అంచనా.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications