fuel prices discounts: గత కొంత కాలంగా పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులను పట్టిపిడిస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులకు అదనంగా ఇంధన ధరలు మరింత భారాన్ని పెంచుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో తక్కువ ధరకే పెట్రోల్ అందిస్తున్నారు అని విన్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కాదా... అయితే దేశంలోని ప్రైవేట్ రంగంలో రెండవ అతిపెద్ద ఇంధన రిఫైనరీ సంస్థ నయారా ఎనర్జీ అన్యువల్ సేవింగ్స్ స్కిం 'మహా బచత్ ఉత్సవ్'ను మళ్లీ తీసుకువచ్చింది. ఈ స్కిం ఏప్రిల్ 1 నుండి జూన్ 30 వరకు అమలులో ఉంటుందని వెల్లడించింది. కానీ ఈసారి కంపెనీ కస్టమర్ల కోసం మరిన్ని డిస్కౌంట్లను తీసుకువచ్చింది. 3 వేలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన పెట్రోల్ కొనుగోలుపై కంపెనీ లీటరుకు 3 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది.

పెట్రోల్ పై డిస్కౌంట్ ఎంతంటే : మీరు రూ.600 నుండి రూ.2,999 విలువైన పెట్రోల్ కొనుగోలు చేస్తే లీటరుకు రూ.2 డిస్కౌంట్ లభిస్తుంది. ఇక డీజిల్ కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ లీటరుకు రూ.1 డిస్కౌంట్ ఇస్తుంది. రష్యన్ కంపెనీ అయినా రోస్నెఫ్ట్ నయారా ఎనర్జీలో భారీగా పెట్టుబడి పెట్టింది. దీని గురించి వివరిస్తూ ఈ మెగా సేవింగ్స్ ఆఫర్ ద్వారా మేము మా కస్టమర్లతో మరింతగా కనెక్ట్ అవ్వగలమని అలాగే వాహనదారులతో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక సరైన మార్గం అని కంపెనీ తెలిపింది.
అంతేకాదు ఈ సంవత్సరం ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాలుగా దీనికి మంచి స్పందన వస్తోంది. ఇంకా మా కస్టమర్లు మాపై ఎంత నమ్మకం ఉంచారో చూపిస్తుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు డబ్బు ఆదా చేసుకునేందుకు పెట్రోల్ ఇంకా డీజిల్‌ను అందించాలని మేము కోరుకుంటున్నాము. దీనితో పాటు కొత్త కస్టమర్లకు నైరా ఎనర్జీ బెస్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అవకాశాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము అని తెలిపింది.
6,500కి పైగా పెట్రోల్ పంపులు: సమ్మర్ హాలిడేస్ ఇంకా ఐపీఎల్ సీజన్ సమయంలో ఈ అఫర్ స్కిం వచ్చింది. కాబట్టి ఇలాంటి సమయంలో కస్టమర్లు ప్రయాణించేటప్పుడు ఇంకా ఎక్కువగా ట్రావెలింగ్ చేసేవారికి డబ్బు ఆదా చేసువడానికి ఉపయోగపడుతుంది. దీనితో పాటు అన్ని నయారా ఎనర్జీ పెట్రోల్ పంపులలో కస్టమర్లు పెట్రోల్, డీజిల్‌పై ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందుతారు. దీని ద్వారా వారికి సేవింగ్స్ అవకాశం ఇస్తుంది. గుజరాత్‌లోని వాడినార్‌లో కంపెనీకి 20 మిలియన్ టన్నుల రిఫైనరీ ప్లాంట్ ఉంది. అంతేకాకుండా, కంపెనీ దేశవ్యాప్తంగా 6,500కి పైగా పెట్రోల్ బ్యాంకులను నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications