Petrol Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!
అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. ఇరాన్ హర్మూజ్ జల సంధి మూసివేయడంతో ముడి చమురు రవాణా చాలా వరకు ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ముడి చమురు ధర భారీగా పెరిగింది. దీంతో పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. భారత్ లో కూడా పెట్రోల్, డీజిలు ధరలు పెరిగాయి. అయితే తాజా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో ముడి చమురు రవాణా క్రమంగా పెరిగింది. హర్మూజ్ జల సంధి గుండా ముడి చమురు నౌకలు స్వేచ్ఛగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ముడి చమరు ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రిటైలర్ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించింది.
పెట్రోల్ ధర రూ.5, డీజిల్ ధర రూ.3 తగ్గించింది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నయారా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ ధర లీటర్ రూ.5, డీజిల్ లీటర్ కు రూ.3 పెంచింది. ఇప్పుడు ముడి చమురు ధర తగ్గడం వల్ల ధరలను తగ్గించింది. అయితే రిటైల్ ఇంధన రంగంలో గత రెండేళ్లలో మొదటిసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారు. తగ్గిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. తగ్గించిన ధరల దేశవ్యాప్తంగా ఉన్న 7,000 నయారా
ఇంధన కేంద్రాల్లో ఈ తగ్గింపు అమల్లోకి వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. పెట్రోల్, డీజిల్ ధరలు వ్యాట్ ను బట్టి ఆయా రాష్ట్రాల్లో ధరలు హెచ్చుతగ్గులు ఉండనున్నాయి. కాగా ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ పెట్రోలియం లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ మాత్రం ధరలు మారాలేదు.

అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పటికీ దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు. అయితే ఇదే పరిస్థితి రెండు నుంచి మూడు నెలలు కొనసాగితే ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) దేశంలో ఇంధన కేంద్రాల్లో 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గిస్తే ప్రభుత్వ రంగ సంస్థల్లో ధరలు తగ్గుతాయి. కాగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల్లో ధరలు మారలేదు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102 ఉంది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.115 కు పైగా ఉంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. మే నెల ద్వితీయార్థంలో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ లీటర్ పై రూ. 7.50 చొప్పున పెంచింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మరితం తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ చమురు మార్కెట్ లోకి ఇరాన్ చమురు వస్తున్న నేపథ్యంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications