Naveen Jindal Daughter Wedding: భారతదేశంలోని అత్యంత శక్తిమంతమైన వ్యాపార కుటుంబాలలో ఒకటైన జిందాల్ ఫ్యామిలీలో పెళ్లి సందడి అంబరాన్నంటింది. బిలియనీర్, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ కుమార్తె యశస్విని జిందాల్ వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకను ఊహించని విధంగా బాలీవుడ్ సినిమా రేంజ్ లో నిర్వహించారు. ముఖ్యంగా ఇందులో వధూవరులు హైలైట్ గా నిలిచారు.

ఈ వేడుకల్లో భాగంగా, జిందాల్ కుటుంబానికి చెందిన నలుగురు సోదరులు.. సజ్జన్, రతన్, నవీన్, పృథ్వీ రాజ్ జిందాల్ కలిసి ఉల్లాసంగా నృత్యం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు, రాజకీయ రంగంలో పరస్పర ప్రత్యర్థులుగా భావించే కంగనా రనౌత్ (బీజేపీ ఎంపీ), మహువా మొయిత్రా (టీఎంసీ ఎంపీ), సుప్రియా సూలే (ఎన్‌సీపీ ఎంపీ) వంటి ప్రముఖులు ఒకే వేదికపై 'ఓం శాంతి ఓం' పాటకు స్టెప్పులు వేయడం ఈ పెళ్లి వేడుకల్లో మరో హైలైట్‌గా నిలిచింది.
వధూవరుల వివరాలు..
నవీన్ జిందాల్, షాలు జిందాల్ దంపతుల ఏకైక కుమార్తె యశస్విని. మార్చి 1999లో జన్మించిన యశస్విని.. ఉన్నత విద్యను అమెరికాలోని ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీలో సైకాలజీలో పూర్తి చేశారు. విదేశాల్లో చదివినా.. ఆమె కూచిపూడి సంస్కృతిని విడిచిపెట్టలేదు. కూచిపూడి గురువులైన రాజా & రాధా రెడ్డి, కౌసల్య రెడ్డిల వద్ద శిక్షణ పొందిన ఆమె 2015లో 'ఢిల్లీస్ మోస్ట్ స్టైలిష్ యూత్ ఐకాన్' సహా అనేక పురస్కారాలు అందుకున్నారు.
ఇక వరుడి విషయానికొస్తే.. జిందాల్ అల్లుడు శాశ్వత్ సోమనీ కూడా పారిశ్రామిక నేపథ్యం నుంచే వచ్చారు. ఆయన సోమనీ ఇంప్రెసా లిమిటెడ్ చైర్మన్, MD అయిన సందీప్, సుమితా సోమనీల కుమారుడు. వీళ్లకి గ్లాస్, శానిటరీవేర్ రంగంలో బిజినెస్ లు ఉన్నాయి. శాశ్వత్ విదేశాల్లోని UCLAలో ఎకనామిక్స్, సైకాలజీ పూర్తి చేసి, లండన్ బిజినెస్ స్కూల్ నుంచి MBA పట్టా పొందారు. ప్రస్తుతం ఆయన సోమనీ గ్రూప్‌లో 'హెడ్ ఆఫ్ స్ట్రాటజీ'గా వ్యవహరిస్తూ కుటుంబ వ్యాపారంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జిందాల్ సామ్రాజ్యం
జిందాల్ కుటుంబం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 36 బిలియన్ డాలర్లకు పైగా నికర ఆస్తులతో భారతదేశంలోని మూడవ అత్యంత ధనిక కుటుంబంగా ఉంది. ఈ వ్యాపార సామ్రాజ్యం వెనుక జిందాల్ సోదరుల దార్శనికత ఉంది. నవీన్ జిందాల్ స్వయంగా వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకునిగా ప్రసిద్ధి చెందారు. జిందాల్ స్టీల్ & పవర్ (Jindal Steel & Power) ఛైర్మన్ అయిన ఆయన, లోక్‌సభ సభ్యుడిగా కూడా పనిచేశారు. అంతేకాక, ఆయన OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్‌గా విద్యా రంగానికి కూడా సేవ చేస్తున్నారు. 2024 లోక్‌సభ అఫిడవిట్ ప్రకారం ఆయన చరాస్తులు దాదాపు రూ.1230 కోట్లు. ఈ నివేదికలో 20 కిలోల బంగారం, అనేక విలాసవంతమైన కార్లు, ఇతర పెట్టుబడుల వివరాలు ఉన్నాయి.
ఈ వివాహం ఢిల్లీలో ఎంతో వైభవంగా జరిగింది. పరిశ్రమల దిగ్గజాలు, సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఒకవైపు వ్యాపార సామ్రాజ్యాల కలయిక, మరోవైపు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఒకే వేదికపై డ్యాన్స్ చేస్తూ కనిపించడం... ఈ నవీన్ జిందాల్ కుమార్తె వివాహాన్ని ఈ ఏడాదిలోనే అత్యంత చర్చనీయాంశమైన వేడుకగా నిలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications