Multibagger Stock: స్టాక్ మార్కెట్ల గురించి అందరూ తరచుగా మాట్లాడుకునే మాటేంటంటే.. రిస్క్ తీసుకునేవాడికే రివార్డ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని మిడ్ క్యాప్, పెన్నీ స్టాక్స్ విషయంలో ఈ మాట అక్షరాలా నిజం అని ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న స్టాక్ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది నేషనల్ స్టాండర్డ్ ఇండియా లిమిటెడ్ (National Standard India Limited) స్టాక్ గురించే. ఒకప్పుడు ఈ స్టాక్ ధర రూ.21 వద్ద ట్రేడ్ అవుతుండేది. కానీ ప్రస్తుతం ఈ స్టాక్ ఉదయం ధర రూ.5,369.45 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్వెస్టర్ల అదృష్టాన్ని మార్చేసిన స్టాక్..
23 జనవరి 2018న ఈ కంపెనీ షేర్ సంపద BSEలో కేవలం రూ.21.90 వద్ద ఉంది. కానీ ఈ రోజు మాత్రం దాని రేటు రూ.5,369.45 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ సమయంలో ఈ స్టాక్ ధరలలో 24,400 శాతం వరకు గ్రోత్ వచ్చింది. రెండేళ్ల కాలంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఊహించని రాబడిని అందించింది.

సంవత్సర కాలంలో..
గడచిన సంవత్సరం గురించి మాట్లాడుకున్నట్లయితే.. అప్పుడు కంపెనీ షేరు ధర రూ.4098.30 స్థాయి నుంచి.. రూ.5,369.45 స్థాయికి పెరిగింది. ఈ కాలంలో పెట్టుబడిదారులకు దాదాపు 315% రాబడిని స్టాక్ అందించింది. అయితే.. గత 6 నెలలుగా ఈ స్టాక్‌కు అనుకూలంగా లేదు. ఈ కాలంలో నేషనల్ స్టాండర్డ్ (ఇండియా) లిమిటెడ్ షేర్లు 49.57% పడిపోయింది.

లక్షను రెండు కోట్లుగా మార్చిన స్టాక్..
ఏడాది క్రితం ఈ స్టాక్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి ఇప్పుడు దాని విలువ రూ.4.16 లక్షలకు చేరుకునేది. అదేవిధంగా.. రెండేళ్ల క్రితం షేరు ధర రూ.21.90 వద్ద అయినప్పుడు.. లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన వ్యక్తికి ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.2.45 కోట్ల రాబడి వచ్చి ఉండేది. దీర్ఘకాలంలో ఇందులో పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లు మంచి రాబడులను పొందారు.

కంపెనీ వ్యాపారం..
నేషనల్ స్టాండర్డ్ (ఇండియా) లిమిటెడ్ అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,740 కోట్లు గా ఉంది. వాల్యూ రీసెర్చ్ ప్రకారం ఇది రుణ రహిత సంస్థ. లోధా డెవలపర్స్ కంపెనీ ఈ సంస్థకు సబ్సిడరీ కంపెనీగా ఉంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications