Post office scheme: ఎఫ్‍డీ కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తున్న పోస్టాఫీస్ పథకం..
చాలా మంది డబ్బులు సంపాదిస్తారు. కానీ దానిని ఎలా పొదుపు చేయాలో తెలియదు. కష్టపడి సంపాదించిన డబ్బును ఆస్తులలో పెట్టుబడి పెట్టడం, తగినంత రాబడిని పొందడం చాలా విలైంది. అయితే హామీతో కూడిన పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. అలాంటి పథకాల్లో పోస్టాఫీస్ పొదుపు పథకాలు ఉంటాయి. ప్రజలు ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడతారు.

5 సంవత్సరాలు
ఎందుకంటే ఇది సురక్షితమైన, హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. పోస్టాఫీస్ పథకాల్లో ప్రచూర్యం పొందిన పథకం నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఇప్పుడు FD కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది. NSC మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు ఉంటుంది. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ పథకాన్ని ఏదైనా పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ నుంచైనా తీసుకోవచ్చు.

వడ్డీ రేటు
ఈ పథకంలో ప్రస్తుతం వార్షికంగా 6.8 శాతం కాంపౌండింగ్ వడ్డీ రేటును అందిస్తున్నారు. మీరు పాలసీ వ్యవధిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే మెచ్యూరిటీ మొత్తాన్ని పొందుతారు. ఎన్‌ఎస్‌సీ కాలిక్యులేటర్ ప్రకారం మీరు 5 సంవత్సరాల పాటు రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే, మెచ్యూరిటీ వ్యవధి తర్వాత మీకు రూ.14 లక్షలు లభిస్తాయి.

కనిష్ఠంగా రూ. 1000
మీరు రూ. 5 లక్షల మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లయితే, అది 5 సంవత్సరాలలో రూ. 6,94,746 అవుతుంది. 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. పిల్లల కోసం వారి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన వారసులు ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో కనిష్ఠంగా రూ. 1000 పెట్టుబడి పెట్టొచ్చు. ముందుగా నిర్ణయించిన సమయ వ్యవధి కంటే ముందు మీరు డబ్బును విత్‌డ్రా చేయలేరు. కొన్ని మినహాయింపులతో ఉపసంహరించుకోవచ్చు.


Click it and Unblock the Notifications