sample survey: భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. అతి త్వరలోనే మూడో స్థానాన్ని చేజిక్కించుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సమయంలో దేశంలోని విద్య, ఉపాధి, నివాసం, మంచినీరు, ఇంధనం వంటి అత్యవసరాల పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ఓ లక్ష్యాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఆ దిశగా వేగంగా ముందుకు సాగగలం.

విద్య, ఉపాధి అవకాశాలు పెరిగనట్లేనా?
నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్(NSSO) దేశంలో జరిపిన MIS సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. విద్య, ఉపాధి అవకాశాలతో పాటు ఇతర రంగాల్లో ప్రజల శక్తియుక్తులు బయటపడ్డాయి. 15-24 వయసు గల భారతీయుల్లో.. 29.3 శాతం మంది విద్య, ఉపాధి లేదా శిక్షణలో లేరని తేలింది. పూర్వం 15-29 వయసులోని యువకుల్లో ఇది 35 శాతంగా ఉండేదని తెలుస్తోంది. సర్వేకు ముందు 3 నెలల డేటా చూస్తే 18 ఏళ్లు పైబడిన దాదాపు 73 శాతం మంది మొబైల్ ఫోన్లను ఉపయోగించినట్లు వెల్లడైంది.

అర్బన్, రూరల్ మధ్య భారీ వ్యత్యాసం:
మార్చి 31, 2014 తర్వాత సుమారు 10 శాతం కుటుంబాలు కొత్తగా, 50 శాతం మొదటిసారిగా ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేశారు. 63 శాతం గృహాలకు వంట కోసం స్వచ్ఛ ఇంధనం అందుబాటులో ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను పోల్చి చూస్తే ఈ తేడా చాలా అధికంగా ఉంది. రూరల్ ఏరియాల్లో 50 శాతం ఉంటే అర్బన్ లో 92 శాతం ఈ ఇంధనాన్ని వినియోగించే వారున్నారు. LPG, న్యాచురల్ గ్యాస్, గోబర్ గ్యాస్, బయోగ్యాస్, సోలార్ మరియు పవన విద్యుత్తును స్వచ్ఛ ఇంధనంగా సర్వే గుర్తించింది.

నీరు, మరుగుదొడ్డి వసతులు భేష్:
ఇక దేశంలో 96 శాతం మందికి మంచినీటి వనరులు ఉన్నాయి. అంటే పూర్తిగా ఇంటిలోకి నల్లా కనెక్షన్, పబ్లిక్ ట్యాప్, హ్యాండ్ పంప్, వర్షపు నీరు సేకరణ, ప్రభుత్వ లేదా ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా సప్లయి వంటి అవకాశాలను అందిపుచ్చుకునే స్థాయిలో ఉన్నారన్నమాట. 98 శాతం ప్రజలకు వివిధ రకాల మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. 82 శాతం మందికి తమ ప్రాంగణంలోనే సబ్బు లేదా డిటర్జెంటుతో చేతులు కడుక్కునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

ఎందుకీ సర్వే..
కొన్ని ముఖ్యమైన సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDG) సూచికల అంచనాలను అభివృద్ధి చేయడం కోసం సమాచారాన్ని సేకరించడం మల్టిపుల్ ఇండికేటర్ సర్వే(MIS) లక్ష్యం. 2020లో దీన్ని నిర్వహించాలని మొదట భావించారు. కానీ కొవిడ్-19 కారణంగా ఫీల్డ్ వర్కును ఆగస్టు 15, 2021 వరకు పొడిగించారు. కాగా దేశమంతటా తన 78వ విడత సర్వేను NSSO తాజాగా పూర్తిచేసింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications