2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేషనల్ అసెట్ రీస్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (NARCL) లేదా బ్యాడ్ బ్యాంకును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బ్యాడ్ బ్యాంకు ఆపరేషన్స్ జూన్ నెల నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బ్యాడ్ బ్యాంకు అనేది రుణదాతల ఎన్పీఏలను స్వాధీనం చేసుకునే సంస్థ. ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల సహకారంతో ఈ కొత్త సంస్థను రూపొందిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (CEO) సునీల్ మెహాతా తెలిపారు.

వచ్చే నెల నుండి బ్యాడ్ లోన్స్
ఇందుకు సన్నాహక పనులు జరుగుతున్నాయని, ఇది వచ్చే నెల నుండి పని చేసే అవకాశాలు ఉన్నాయని, ఈ మేరకు తాము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని మెహతా తెలిపారు. NARCL యొక్క అతిపెద్ద ప్రయోజనం గుర్తించబడిన NPAలను (నిరర్ధక ఆస్తులు) సమగ్రపరచడమన్నారు. మనీ రికవరీలో ఇది సమర్థవంతంగా పని చేస్తోందని భావిస్తున్నట్లు తెలిపారు. బ్యాడ్ లోన్స్ లేదా ఎన్పీఏల పరిష్కారంలో ఇది సమర్థవంతంగా ఉంటుందన్నారు. రుణదాతలు గుర్తించిన బ్యాడ్ లోన్స్‌ను NARCL తన పరిధిలోకి తీసుకుంటుందన్నారు.

పరిష్కారం
బ్యాడ్ బ్యాంక్ ఒక ఆర్థిక సంస్థగా ఏర్పాటయి, రుణదాతల వద్ద పేరుకు పోయిన మొండి బకాయిలను తీసుకుని, వాటికి ఓ పరిష్కారం చూపుతుంది. ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల సహకారంతో ఈ బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు అవుతోంది. మొండి బకాయిల పరిష్కారానికి చాలా మంది రుణదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఓసారి బ్యాడ్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమైతే 100 శాతం రుణాలను దానికి అప్పగించి రుణదాతలు ఒక మంచి పరిష్కారాన్ని పొందే అవకాశం ఉంటుంది.

స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో..
రుణదాతలు గుర్తించిన ఎన్పీఏలను NARCL స్వాధీనం చేసుకుంటుంది. ఇందులోని లీడ్ బ్యాంక్ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఇతర ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీల నుండి బిడ్స్‌ను ఆహ్వానిస్తుంది. ఎన్పీఏకు అధిక వ్యాల్యూ రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది. రుణదాతలు 100 శాతం కేటాయింపులు జరిపిన ఆస్తులను ఇందుకు ఎంచుకుంటుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications