Jobs: ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కమ్మేసిన వేళ చాలా మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. కానీ.. IIT బాంబేలో జరుగుతున్న క్యాంపస్ ఇంటర్వ్యూలో 9వ రోజు వరకు 1500 మందికి పైగా అభ్యర్థులు ఆఫర్ లెటర్‌లను అందుకున్నారు. ఈ మెగా రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో విదేశీ కంపెనీలతో పాటు స్వదేశీ కంపెనీలు కూడా పాలుపంచుకుంటున్నాయి.

అదరగొడుతున్న కంపెనీలు..
దేశీయ దిగ్గజ కంపెనీలైన రిలయన్స్, అదానీ, టాటా గ్రూప్ కంపెనీలు చాలా మందిని మంచి ప్యాకేజీలు ఆఫర్ చేసి రిక్రూట్ చేసుకుంటున్నాయి. వీటికి తోడు TSMC, మెకిన్సే & కంపెనీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, హోండా జపాన్, మోర్గాన్ స్టాన్లీతో పాటు అనేక ఇతర విదేశీ కంపెనీలతో సహా 44 కంపెనీలు ఈ క్యాంపస్ ఇంటర్వ్యూ కోసం నమోదు చేసుకున్నాయి.

75 దేశాల్లో ఉద్యోగాలు..
ఈ డ్రైవ్ లో ఆఫర్ లెటర్లు అందుకున్న 1500 మంది దాదాపుగా 75 దేశాల్లో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొంత మంది రూ.25 కోట్ల మెగా వేతన ప్యాకేజీలను పొందటం గమనార్హం. 2021-22లో అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 66 మంది ఆఫర్ లెటర్‌లను అందుకోగా.. ప్రస్తుత ఏడాది 9వ రోజు వరకు మెుత్తం 71 ఆఫర్లను విద్యార్థులు పొందారు.ఈ ఓవర్సీస్ ఆఫర్లలో జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలు ఎక్కువగా ఉన్నాయని ఎంప్లాయిమెంట్ గ్రూప్ తెలిపింది.

గతంలో ఆఫర్లు ఇలా..
2021-22లో USA, నెదర్లాండ్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా మరిన్ని దేశాలు IIT బాంబేలో ఎంపికల్లో పాల్గొన్నాయి. యూఎస్ఏ, జపాన్, యూఏఈ, సింగపూర్, నెదర్లాండ్స్, హాంకాంగ్ సహా పలు దేశాల్లో 66 అంతర్జాతీయ ఆఫర్లను పొందినట్లు ఎంప్లాయిమెంట్ గ్రూప్ తెలిపింది.

అనేక ఆఫర్లు..
9 రోజుల పాటు జరిగిన ఈ క్యాంపుల ఇంటర్వ్యూల్లో 1,500 ఆఫర్లలో 1,224 ఆఫర్‌లు మాత్రమే అంగీకరించబడ్డాయి. 71 అంతర్జాతీయ ఆఫర్లలో 64 ఆఫర్‌లు ప్రకటించబడ్డాయి. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో చాలా మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లను అందుకున్నట్లు సమాచారం. ఏదేమైనా ఐఐటీల్లోని విద్యార్థులకు కార్పొరేట్ రంగంలో మంచి డిమాండ్ ఉంది. వీరిని నియమించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఆసక్తి చూపుతుంటాయి.


Click it and Unblock the Notifications