Nathan Anderson: ఇటీవలి కాలంలో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ పేరు తరచుగా వినిపిస్తోంది. గడచిన వారంలో ఈ సంస్థను ఇక మూసివేయాలని నిర్ణయించినట్లు వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి భారతీయ బిలియనీర్ అదానీని టార్గెట్ చేయటంతో అతని పేరు అందరికీ సుపరిచితం అయ్యింది.
అయితే తాజాగా నేడు అతని పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి అతని పేరు నేరస్థుల జాబితాలో చేరటం పెద్ద చర్చకు దారితీస్తోంది. కెనడాలోని అంటారియోలో జరిగిన కోర్టు వాదనల్లో వివాదాస్పద షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, దాని వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్‌కు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ రహస్య సంబంధాలు, సంభావ్య సెక్యూరిటీల మోసంతో పాటు లోపభూయిష్ట బహిర్గతాల సంబంధించిన ఆధారాలు బయటపడినట్లు మీడియా కథనాల ప్రకారం వెల్లడైంది.

నేట్ ఆండర్సన్, అన్సన్ ఫండ్స్ రెండింటికీ సెక్యూరిటీల మోసం వ్యవహారంలో మల్టిపుల్ కౌంట్స్ ఉన్నట్లు కెనడియన్ ఆన్‌లైన్ ఇన్వెస్టిగేటివ్ న్యూస్ అవుట్‌లెట్ మార్కెట్ ఫ్రాడ్స్ నివేదించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉందని వెల్లడించింది. హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నేట్ ఆండర్సన్ 2025లో సెక్యూరిటీల మోసానికి పాల్పడినట్లు దాదాపుగా ఖచ్చితంగా చెప్పవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడానికి కేవలం మూడు రోజుల ముందు అకస్మాత్తుగా హిండెన్‌బర్గ్ సంస్థను ఇక మూసివేస్తున్నట్లు చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇంత అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవటంపై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హిండెన్‌బర్గ్‌తో సహా వివిధ షార్ట్ సెల్లర్‌లు పరిశోధనా సంస్థల వెనుక ఉన్న రహస్య శక్తులను బహిర్గతం చేసే సిరీస్‌లో మొదటిదాన్ని నవంబర్ 2024లో బ్లూమ్‌బెర్గ్ క్రాక్ రీసెర్చ్ బృందం నివేదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాథన్ తోకముడిచారా అని అనిపిస్తోంది.
ఆండర్సన్ కూడా అన్సన్ లేదా మరెవరితోనైనా భాగస్వామ్యాన్ని బహిరంగంగా ఖండించారు. అయితే లీకైన ఇమెయిల్స్ మరో విధంగా సూచిస్తున్నాయి. 2019లో హిండెన్‌బర్గ్, అన్సన్‌కి చెందిన సంజీవ్ పూరి మధ్య ఒక వాణిజ్యం ద్వారా మార్పిడి చేయబడిన డజన్ల కొద్దీ మెయిల్స్ అన్సన్ సంపాదకీయ నాయకత్వం వహించాయని సూచిస్తున్నాయి. హిండెన్‌బర్గ్ తొలిసారిగా జనవరి 2023లో అదానీ గ్రూప్‌పై విడుదల చేసిన నివేదిక ఏకంగా 150 బిలియ్ డాలర్ల మేర గౌతమ్ అదానీకి నష్టాలను కలిగించింది. అదానీ గ్రూప్‌పై దాడుల్లో అన్సన్ పాత్ర అస్పష్టంగానే ఉంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications