Dividend Stock: ఒక్కో షేరుపై రూ.100 డివిడెండ్.. వారం రోజులుగా దూసుకుపోతున్న స్టాక్..
Dividend Stock: షేర్ ధర చిన్నదే అయినప్పటికీ కంపెనీ ప్రకటించిన డివిడెండ్ మాత్రం చాలా పెద్దది. ప్రస్తుతం మార్కెట్లో చాలా కంపెనీలు తమ ఫలితాలను ప్రకటిస్తూనే ఇన్వెస్టర్లకు మంచి డివిడెండ్ ఆదాయాన్ని అందిస్తున్నాయి.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది నర్మదా జెలటైన్స్ స్టాక్ గురించే. తాజాగా కంపెనీ బోర్డు తన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.100 స్పెషల్ డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ ప్రకటన చేసిన తర్వాత గత వారం రోజులుగా స్టాక్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో షేర్లు 80 శాతం లాభపడింది. గత 5 ట్రేడింగ్ సెషన్లలో నర్మదా జిలాటిన్స్ షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకుతూ దాదాపుగా 53 శాతం లాభపడ్డాయి.

స్టాక్ ధర పెరుగుదల..
నర్మదా జెలటైన్స్ షేర్లు గత 7 ట్రేడింగ్ సెషన్లలో పెరగటం ఇన్వెస్టర్లకు మంచి రాబడులను తెచ్చిపెట్టింది. డిసెంబర్ 1, 2022న బీఎస్ఈ సూచీలో రూ.237.95 వద్ద స్టాక్ ధర డివిడెండ్ ప్రకటన తర్వాత ఊపందుకుంది. ఈ రోజు మార్కెట్లో స్టాక్ ధర దాదాపుగా రూ.423.50 వద్ద ముగిసింది. ఈ క్రమంలో స్టాక్ తన కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. అదే విధంగా స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.160 వద్ద ఉంది. ఈ రోజు కూడా స్టాక్ 10 శాతం అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది. అలా స్టాక్ వారాంతంలోనూ తన దూకుడును కొనసాగించింది.

డివిడెండ్ పొందటం ఎలా..
కంపెనీ ఇటీవల జరిగిన బోర్డ్ సమావేశంలో ఒక్కో షేరుపై 1000 శాతం డివిడెండ్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక మధ్యంతర డివిడెండ్ పొందటానికి కంపనీ డిసెంబర్ 19ని రికార్డు తేదీగా నిర్ణయించింది. ఈ సవరణకు ముందు రికార్డు తేదీ డిసెంబర్ 15గా ఉంది. డివిడెండ్ డిక్లరేషన్ తేదీ నుంచి 30 రోజుల్లోపు కంపెనీ దానిని చెల్లిస్తుంది. ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ నుంచి డివిడెండ్ ఆదాయాన్ని పొందాలంటే కంపెనీ ప్రకటించిన రికార్డు తేదీ నాటికి వారి డీమాట్ ఖాతాలో షేర్లను కలిగి ఉండాలి.

కంపెనీ లాభాలు.. వ్యాపారం
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.46.38 కోట్లుగా నమోదైంది. ఈ క్రమంలో నికర లాభం రూ.2.84 కోట్లుగా ఉంది. ఇవి అంతకు ముందు త్రైమాసికం కంటే ఎక్కువ కాగా ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.257 కోట్లుగా ఉంది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ 1961లో స్థాపించబడింది. కెమికల్స్ వ్యాపారంలో ఉన్న కంపెనీ ossein, gelatin ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందింది. ఫార్మా రంగంలో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు.


Click it and Unblock the Notifications