Infosys News: దేశంలో అతిపెద్ద IT కంపెనీల్లో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో ఉంది. దాని సహవ్యవస్థాపకులుగా నారాయణ మూర్తి అందరికీ సుపరిచితమే. అయితే ఇప్పుడు ఆయన మనవడు ఏకాగ్ర రోహన్ మూర్తి గురించి వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. వయసు కేవలం 5 నెలలే అయినా కోట్లాది రూపాయలు విలువైన షేర్లు ఆ పిల్లాడి సొంతం కావడమే ఇందుకు కారణం.
తాజాగా నారాయణ మూర్తి మనవడు ఏకంగా 4 కోట్లు సంపాదించాడు. 5 నెలల ఏకగ్రహ రోహన్ మూర్తికి తన తాత నారాయణ మూర్తి గత నెలలో 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చారు. వాటి నుంచి ఇప్పుడు 4.2 కోట్ల మేర డివిడెండ్ ఆదాయాన్ని పొందాడు. దీంతో ఆ పిల్లాడు కాస్తా మరింత సంపన్నుడు అయ్యాడు. అతడు హోల్డ్ చేస్తున్న మొత్తం షేర్ల విలువ 210 కోట్లకు చేరింది.

గతేడాది నవబంర్ 10న ఏకాగ్ర బెంగళూరులో జన్మించాడు. బాలుడి తండ్రి రోహన్ మూర్తి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో Phd చేసి, సాఫ్ట్‌వేర్ సంస్థ సోరోకోను నడిపిస్తున్నారు. తల్లి అపర్ణ కృష్ణన్ మూర్తి మీడియా అధినేతగా కొనసాగుతున్నారు. ఇకపోతే నారాయణ మూర్తి భార్య సుధామూర్తి ఇటీవలే రాజ్యసభ MPగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్ , అక్షతా మూర్తి సంతానం ఇద్దరుతో పాటు ఏకాగ్ర రోహన్ మూర్తి మూడో మనవడు.
ఇన్ఫోసిస్ తన Q4 ఫలితాలను ఇటీవల డిక్లేర్ చేసింది. తుది డివిడెండ్ గా 20 మరియు 8 ప్రత్యేక డివిడెండ్‌తో సహా మొత్తం 28 మేర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీని మే 31గా నిర్ణయించగా.. జూలై 1న పేమెంట్ ఉండనుంది. అయితే ఇన్ఫోసిస్‌లో రోహన్ 1.6తో పాటు అక్షత 1.05, సుధా మూర్తి 1.64 శాతం షేర్లను హోల్డ్ చేస్తున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications