సొంత ఇల్లు అనేది ప్రతిఒక్కరి కల. అయితే అన్ని వసతులతో కూడిన ఇల్లు అంటే ఎవరు వొద్దంటారు. ఈ కాలంలో ఆర్కిటెక్చర్ చాల ముందంజలో ఉంది. స్థలం ఉంటె చాలు తక్కువ సమయంలోనే అన్ని లగ్జరీ సదుపాయాలతో ఇల్లు కట్టి అందిస్తున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి బెంగళూరులో ఒక లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నారు. ఈ ఫ్లాట్ ధర నోయిడా వంటి నగరంలో 25 కంటే ఎక్కువ విల్లాలను కొనొచ్చు. నారాయణ మూర్తి ఈ కొత్త ఫ్లాట్లో ఎన్నో ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
బెంగళూరులో మూర్తి కొన్న ఈ ఫ్లాట్ ప్రదేశం ఖరీదైన ప్రదేశాలలో ఒకటి. బెంగళూరులోని యూబీ సిటీలోని కింగ్‌ఫిషర్ టవర్స్‌లో నారాయణ మూర్తి ఈ ఫ్లాట్‌ను కొన్నారు. ఈ టవర్‌లో మూర్తిది రెండవ ఫ్లాట్. ఈ కొత్త ఫ్లాట్ ధర రూ.50 కోట్లు అని చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం ఇదే టవర్‌లోని 23వ అంతస్తులో నారాయణమూర్తి, భార్య సుధామూర్తి రూ.29 కోట్లతో ఫ్లాట్‌ను కొన్నారు.

కొత్త ఫ్లాట్ ఎంత పెద్దది?
16వ అంతస్తులో విలాసవంతమైన ఈ నాలుగు బెడ్ రూమ్స్ ఫ్లాట్ 8400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో ఐదు కార్ పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, దీని ధర చదరపు అడుగుకు రూ. 59,500గా చెప్తున్నారు. నారాయణమూర్తి ఈ ఫ్లాట్‌ను ఓ ముంబై వ్యాపారవేత్త నుంచి కొన్నారు. ఈ వ్యాపారవేత్త దాదాపు 10 సంవత్సరాల క్రితం ఈ ఫ్లాట్‌ను కొన్నారు.
విజయ్ మాల్యాతో పేరుతో
యూబీ సిటీ పేరు విజయ్ మాల్యాతో ముడిపడి ఉంది. 4.5 ఎకరాలలో విస్తరించి ఉన్న UB సిటీలోని కింగ్‌ఫిషర్ టవర్స్ నగరం నడిబొడ్డున మూడు బ్లాకుల్లో 81 ప్రత్యేకమైన అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. 34 అంతస్తుల భవనంలో ఒక్కో ఫ్లాట్ దాదాపు 8,321 చదరపు అడుగులు. విజయ్ మాల్యా పూర్వీకుల ఇల్లు ఉన్న స్థలంలో ఈ టవర్లు నిర్మించారు.
ప్రెస్టీజ్ తన వాటా కింగ్‌ఫిషర్ టవర్స్‌లోని 41 లగ్జరీ అపార్ట్‌మెంట్లను విక్రయించింది, ఇది 2010లో ప్రెస్టీజ్ గ్రూప్ అండ్ మాల్యా మధ్య జాయింట్ డెవలప్మెంట్. ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు, అపార్ట్‌మెంట్లు చదరపు అడుగుకు రూ. 22,000 చొప్పున విక్రయించారు. ఇప్పుడు దీని ధర రెండింతలు పెరిగింది.
కోట్ల విలువైన ఆస్తులు కొన్నారు
రెండేళ్ల క్రితం కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ కుమారుడు రానా జార్జ్ రూ.35 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొన్నారు. 2017లో ఎంబసీ గ్రూప్, ఇంజినీరింగ్ ఔట్‌సోర్సింగ్ కంపెనీ క్వెస్ట్ గ్లోబల్ ఛైర్మన్ అండ్ CEO అయిన అజిత్ ప్రభుకి ఒక అపార్ట్‌మెంట్‌ను రూ. 50 కోట్లకు విక్రయించింది, ఇది ఇప్పటివరకు బెంగళూరులో అతిపెద్ద హోమ్ డీల్. హెబ్బాల్ సమీపంలోని ఎంబసీ వన్‌లో 16 వేల చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను చదరపు అడుగుకు దాదాపు రూ.31 వేల చొప్పున అజిత్ ప్రభు కొన్నారు.
More From GoodReturns

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications