నారా భువనేశ్వరి వాటాదారుగా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ భారీగా పెరుగుతోంది. అప్పర్ సర్క్యూట్లను తాకుతోంది. శుక్రవారం కూడా హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ భారీగా పెరిగింది. 10 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది. ఈ రోజు రూ.60 పెరిగి రూ.661 వద్ద ట్రేడవుతోంది. హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు గురువారం నాడు 10 శాతం కంటే ఎక్కువ జంప్ చేసి రూ. 601.60కి చేరాయి.
రెండవ వరుస సెషన్‌కు ఎగువ సర్క్యూట్‌ను తాకి 5,500 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను సాధించిన సంగతి తెలిసిందే.గత నాలుగు సెషన్లలో ఈ స్టాక్ 55 శాతానికి పైగా పెరిగింగి. గత 30 రోజుల్లో కౌంటర్ 100 శాతానికి పైగా పెరిగింది. 2024 సంవత్సరంలో ఇప్పటివరకు స్టాక్ 150 శాతానికి పైగా పెరిగింది. హెరిటేజ్ గ్రూప్‌ను 1992లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డెయిరీ, రిటైల్, అగ్రి అనే మూడు వ్యాపార విభాగాలతో హెరిటేజ్ ఫుడ్స్ కింద స్థాపించిన సంగతి తెలిసిందే.

హెరిటేజ్ ఫుడ్స్ ప్రమోటర్లలో ఎన్ చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఒకరని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ పేర్కొన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. దీంతో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు దలాల్ స్ట్రీట్‌లోని పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మార్చి త్రైమాసికం చివరి నాటికి ప్రమోటర్ వాటా 41.30 శాతంగా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్‌లో కీలక వాటాదారుగా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి ఉన్నారు.
మార్చి త్రైమాసికం చివరి నాటికి ఆమె హెరిటేజ్ ఫుడ్స్‌లో 2,26,11,525 షేర్లు లేదా 24.37 శాతం వాటాను కలిగి ఉన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ భారీగా పెరగడంతో నారా భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో రూ. 579 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. స్టాక్ పనితీరు బట్టి కొనుగోలు చేయాలి. అంతే తప్ప ఫోమోలో పడి స్టాక్స్ కొనకూడదని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications