స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తలరాత ఇప్పుడైనా మారుతుందా.. నూతన సీఈఓగా నందితా సిన్హా.. ఎవరీ ఈ డైనమిక్ లేడీ..

భారతీయ క్విక్-కామర్స్ రంగం ప్రస్తుతం కేవలం 'వేగవంతమైన డెలివరీ'లకే పరిమితం కాకుండా తీవ్రమైన ఆపరేషనల్ రణరంగంగా మారింది. ఈ హోరాహోరీ పోరులో స్విగ్గీ తన ప్రధాన విభాగమైన ఇన్‌స్టామార్ట్ ను పునరుద్ధరించేందుకు మింత్రా మాజీ సీఈఓ నందితా సిన్హాను వ్యాపార రథసారధిగా ఎంచుకుంది. అయితే ఇదేమి సాధారణ నియామకం కాదు.. ఆచితూచి వేసిన పక్కా బిజినెస్ వ్యూహంగా చెప్పుకోవచ్చు. కాాగా జూన్ 28న స్విగ్గీ సీఈఓ ప్రకటన చేయగా.. ఆగస్టు 3 నుండి ఆమె సీఈఓగా కొనసాగనుంది.

నాలుగేళ్ల వ్యవధిలోనే నలుగురు నాయకులు మారడం, ఇటీవల సీఓఓ, సీబీఓల నిష్క్రమణ ఇన్‌స్టామార్ట్ ఆపరేషనల్ డిజైన్‌లో ఉన్న లోపాలను ఎత్తిచూపాయి. పోటీదారులైన బ్లింకిట్, జెప్టో తమ విస్పష్టమైన పొజిషనింగ్ ద్వారా మార్కెట్‌ను ఆక్రమిస్తుంటే.. ఇన్‌స్టామార్ట్ సరైన బ్రాండ్ ఐడెంటిటీ లేక సతమతమైంది. ఆర్డర్ వాల్యూమ్‌లలో వెనుకబడటం.. అంతర్గత నిర్ణయాల్లో ఆలస్యం, బ్రాండ్ భాగస్వాములతో స్పందన లోపించడం వంటి సమస్యలు వ్యాపారరంగంలో వేగాన్ని తగ్గించాయి.

Swiggy Instamart Nandita Sinha Swiggy Instamart Myntra CEO Flipkart Veteran Quick Commerce Swiggy News Instamart CEO Amitesh Jha E-commerce India Blinkit Zepto Retail Tech Business News -

ఇలాంటి పరిస్థితుల్లో నియామకమైన నందితా సిన్హాకు.. గతంలో వ్యాపారాన్ని లాభాల బాట పట్టించిన బలమైన ట్రాక్ రికార్డ్ ఉంది. మింత్రాను రూ. 782 కోట్ల నష్టాల నుంచి ఏకంగా రూ. 548 కోట్ల లాభాల్లోకి మార్చిన ఆమె అనుభవం ఇన్‌స్టామార్ట్‌కు ఇప్పుడు అత్యంత కీలకంగా మారనుంది. ఈ-కామర్స్ తరహాలో కేవలం కేటలాగ్ పెంచడం కాకుండా.. క్విక్ కామర్స్‌కు ప్రాణపదమైన హైపర్‌లోకల్ సప్లై చైన్ నమూనాను ఆమె క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సి ఉంటుంది.

Also Read

అలాగే అగ్రనాయకత్వం ఖాళీ అవ్వడం ఆమెకు ఒక రకంగా ప్రతికూలత అయినా.. కొత్త ఆలోచనలతో స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేసేందుకు పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది.దీనిని ఆమె ఉపయోగించుకుని వ్యాపారాన్ని పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. ధరల తగ్గింపులతో కాకుండా ప్రైవేట్ లేబుల్స్, హై-మార్జిన్ కేటగిరీల ద్వారా ఆర్డర్ విలువను పెంచడంపై ఆమె దృష్టి సారించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుుతన్నాయి.

స్విగ్గీ వద్ద ప్రస్తుతం రూ. 15 వేల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. అంటే ఇక్కడ పోటీ డబ్బు ఖర్చు పెట్టడంలో లేదు.. ఎవరు మెరుగ్గా ఖర్చు పెడతారనే దానిపైనే ఉంది. పీపుల్స్ లీడర్ గా పేరున్న సిన్హా.. స్విగ్గీ దగ్గరున్న వనరులను సమర్థవంతంగా వాడుతూ ఇన్‌స్టామార్ట్‌కు స్పష్టమైన బ్రాండ్ ఐడెంటిటీని అందిస్తే.. ఈ క్విక్ వాణిజ్య యుద్ధంలో స్విగ్గీ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించడం ఖాయం.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+