ఉద్యోగాలు: AIతో పెను మార్పులు! సంచలన నిజాలు చెప్సిన నీలేకని
భారత్‌లో ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాల్లో పెను మార్పులు రాబోతున్నాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ నందన్ నీలేకని కీలక హెచ్చరిక జారీ చేశారు. గత 100 ఏళ్లలో టెక్నాలజీ ఎంత మారినా, గత 5 ఏళ్లలో వచ్చిన మార్పు వేగం ఊహించనిది. ఇది కాదనలేని నిజం. ఉదాహరణకు, ఒకప్పుడు కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని అలవాటు చేసుకోవడానికి కొంత సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీనివల్ల భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో, NCAER కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఫోసిస్ నందన్ నీలేకని కీలక హెచ్చరిక చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ టెక్నాలజీలు దేశంలోని జాబ్ మార్కెట్‌పై పెను ప్రభావాన్ని, మార్పును సృష్టించాయని ఆయన అన్నారు.
దీంతో పనిచేసే విధానం తలకిందులైంది. దీని ఫలితంగా, భవిష్యత్తులో పెద్ద కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకునే అవకాశం ఉంది.

అదే సమయంలో, దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది చిన్న కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టిస్తాయి. దీనివల్ల దేశంలో ఉద్యోగాల కల్పన రంగంలో భారత్ ఒక భారీ మార్పును చూడబోతోందని NCAER సమావేశంలో నందన్ నీలేకని తెలిపారు.
సాధారణంగా పెద్ద కంపెనీల్లో, నిర్దిష్టమైన పనుల కోసం ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటారు. కానీ చిన్న కంపెనీల్లో ప్రతి ఉద్యోగి అనేక రకాల పనులు చేయాల్సి ఉంటుంది.
ఒకే పనిని ఒకే ఉద్యోగి పదేపదే చేస్తుంటే, ఆ పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సులభంగా ఆటోమేట్ చేయవచ్చు. ఈ మార్పు వల్ల ఎక్కువగా నష్టపోయేది పెద్ద కంపెనీలే. అలాగే, పెద్ద కంపెనీలు ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకోవడంపై తీవ్రంగా దృష్టి సారించాయి. ఈ కారణాల వల్ల కూడా అలాంటి సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కాబట్టి, భవిష్యత్తులో ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వాలు, ప్రజలు పెద్ద కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇకపై చిన్న కంపెనీలు, చిన్న పారిశ్రామికవేత్తలే భారత జాబ్ మార్కెట్‌కు అసలైన ఇంజిన్లు. అందుకే, విధానపరమైన నిర్ణయాల్లో కూడా చిన్న సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలని నందన్ నీలేకని సూచించారు.


Click it and Unblock the Notifications