IPO News: పక్కా కమర్షియల్ ఐపీవో.. తొలిరోజే 100% లాభం, బెట్టింగ్ ఆపని ఇన్వెస్టర్స్..
Namo eWaste Management IPO: దేశీయ స్టాక్ మార్కెట్ల గమనంతో సంబంధం లేకుండా ఐపీవోలు తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐపీవో బంపర్ లిస్టింగ్ నమోదు చేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నమో ఇవేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఐపీవో గురించే. SME కేటగిరీలో వచ్చిన కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో ఏకంగా 90 శాతం ప్రీమియం రేటు రూ.161.50 వద్ద మార్కెట్లోకి అడుగుపెట్టాయి. విజయవంతమైన లిస్టింగ్ తర్వాత సైతం పెట్టుబడిదారుల నుంచి కంపెనీ షేర్ల కొనుగోలుకు భారీ స్పందన కనిపించింది. దీంతో కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి ఇంట్రాడేలో గరిష్ఠంగా రూ.169.55 స్థాయికి చేరుకున్నాయి. దీంతో తొలిరోజే ఐపీవోపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు ఐపీవో 100 శాతం రాబడిని వారి పెట్టుబడిపై అందించింది.

రిటైల్ ఇన్వెస్టర్లకు నమో ఈవేస్ట్ మేనేజ్‌మెంట్ తన ఐపీవోను సెప్టెంబర్ 4-6 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలో కంపెనీ ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.80-85గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా ఉంచింది. బిడ్డింగ్ చివరి రోజున కంపెనీ షేర్లకు పెట్టుబడిదారుల నుంచి భారీగా స్పందన లభించటంతో 225.64 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.51.20 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం 60.24 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది.
కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ రీసైక్లింగ్, రిఫర్బిష్మెంట్ సహా మరిన్ని పరిష్కార సేవలను అందిస్తోంది. ఇదే క్రమంలో ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు, వాషింగ్ మెషీన్‌లు, ఫ్యాన్‌లు, ఎలక్ట్రికల్ పరికరాల వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి కంపెనీ సమగ్ర సేవలను అందిస్తుంది. అలాగే EEE వ్యర్థాలను సేకరించడం, పారవేయడం, రీసైక్లింగ్ చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. అలాగే మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 73% పెరగగా, పన్ను తర్వాత లాభం 183% పెరుగుదలను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications