Naman In-Store IPO: కొత్త ఆర్థిక సంవత్సరంలో తిరిగి ఐపీవోల కోలాహలం మెుదలైంది. మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఐపీవోలు బెట్టింగ్ వేసిన పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపిస్తూ సంతోషాన్ని ఇస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మన్ ఇన్-స్టోర్ కంపెనీ ఐపీవో గురించే. నేడు ఎస్ఎమ్ఈ కేటగిరీలో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో జాబితా చేయబడ్డాయి. ఈ క్రమంలో నమన్ ఇన్-స్టోర్ షేర్లు NSEలో ఒక్కొక్కటి రూ.125 రేటు వద్ద లిస్ట్ అయ్యాయి. అయితే ఇది కంపెనీ వాస్తవ గరిష్ఠ ఇష్యూ ధర రూ.89 కంటే 41 శాతం అధికం కావటం గమనార్హం. ప్రీమియం లిస్టింగ్ జరిగినప్పటికీ.. షేర్లు మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనై 5 శాతం లోయర్ సర్క్యూట్ ధర రూ.118.75కి పడిపోయాయి.

నమన్ ఇన్-స్టోర్ ఐపీవో మూడవ రోజున 309.03 సార్లు సభ్యత్వం పొందింది. దీని రిటైల్ భాగం 328.80 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల భాగం 528.12 రెట్లు, అర్హత కలిగిన సంస్థల కొనుగోలుదారుల భాగం 109.75 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ఇష్యూ మొదటి రోజు 16.32 సార్లు బుక్ చేయబడగా.. రెండవ రోజు 71.27 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. కంపెనీ తాజా ఇష్యూలో పూర్తిగా కొత్త ఈక్విటీ షేర్లను పెట్టుబడిదారులకు అందించింది.
B2B కంపెనీ ప్రధానంగా కార్యాలయాలు,ఇతర రిటైల్ అవుట్‌లెట్‌ల కోసం ఫర్నీచర్ & ఫిక్స్చర్స్, ఇండస్ట్రియల్ మెటల్ ప్రొడక్ట్స్ ఉత్పత్తిలో పనిచేస్తోంది. రిటైల్ కింద కంపెనీ.. కార్యాలయాలు, బ్యూటీ స్టోర్లు, పెయింట్ అవుట్‌లెట్‌లు, ఫ్యాషన్ దుస్తుల దుకాణాలు, తక్కువ ఎత్తులో ఉన్న కిచెన్‌లు, విద్యా సంస్థలు, పాన్ షాపులు, సూపర్ మార్కెట్ షెల్వింగ్ సొల్యూషన్‌ల కోసం మాడ్యులర్ ఫర్నిచర్‌ను తయారు చేస్తోంది. బుటిబోరి, MIDCలో లీజు హోల్డ్ ప్రాతిపదికన భూమిని సేకరించేందుకు ఐపీవో ఆదాయంలో దాదాపు రూ.4.7 కోట్లను ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications