Success Story: ఉదయం కాలేజీ.. సాయంత్రం వ్యాపారం.. రోజుకు రూ.25 వేల ఆదాయం..!

చాలా మంది బాగా చదువుకుని ఉద్యోగం చేయాలని భావిస్తారు. అయితే చాల తక్కువ మంది మాత్రమే వ్యాపారంలోకి అడుగు పెడతారు. కానీ ఓ యువకుడు చదువుకుంటూనే బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. ఒక షాప్ కాదు ఏకంగా నాలుగు షాపులు నడిపిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంతే కాదు పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు. అతనే మైసూరుకు చెందిన విద్యార్థి నాగేంద్ర. అతను స్థానిక కాలేజీలో ఎం.కామ్ చదువుతూనే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తను వ్యాపారం ప్రారంభించిన 8 నెలల్లోనే మైసురులో అందిరికీ తెలిసిపోయాడు. నాగేంద్ర చిన్న పెట్టుబడితో వ్యాపారం చేయాలని భావించాడు. దీంతో ఐక్రీమ్ షాప్ పెట్టాలనుకున్నాడు.

షాప్ రెంట్ తీసుకుంటే అద్దె ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని.. నగరంలోని త్రివేణి ఏరియాలో ఫుట్ పాత్ పై చిన్నగా ఐస్ క్రీమ్ స్టార్ ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయం కాలేజీకి వెళ్లే అతను సాయంత్రం ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేస్తాడు. రాత్రి 10 గంటలకు వరకు షాప్ ఓపెన్ చేసి ఉంచుతాడు. ఈ క్రమంలో అతను మైసూరు వ్యాప్తంగా ఏకంగా 4 ఐస్ క్రీమ్ దుకాణాలు ఓపెన్ చేసి విజయవంతంగా నడిపిస్తున్నాడు. అయితే ఐస్ క్రీమ్ అందరిలాగే అమ్మితే నాగేంద్ర తన షాపులను 4కు చేరేవి కాదు. అతను వినూత్నంగా ఆలోచించి వ్యాపారం ప్రారంభించాడు. మామూలు ఐస్ క్రీమ్ కాకుండా వినియోగదారులకు అభిరుచికి తగ్గట్లుగా వెరైటీ ఐస్ క్రీమ్ లు విక్రయించాడు.

Nagendra a student from Mysore ventured into business while continuing his studies Moreover he is earning 25 000 a day

అరటి పండు, ఎండు జామూన్, క్యారెట్ హల్వా వంటి సహజ పదార్థాలతో కొత్త రుచులను కస్టమర్లకు అందించారు. అతను తీసుకొచ్చిన న్యూ డెజర్ట్ లు మైసూరు ప్రజలకు తెగ నచ్చాయి. దీంతో అతని షాపుకు గిరాకీ భారీగా పెరిగింది. నాగేంద్ర ఎక్కడ రాజీపడకుండా పరిశుభ్రత, నాణ్యత పాటిస్తూ వినియోగదారులకు సేవలందిస్తున్నారు. దీంతో అతని షాపుపై నమ్మం పెరిగింది. దీంతో అతను మరో మూడు చోట్ల ఐస్ క్రీమ్ షాపులు ఓపెన్ చేశాడు. అక్కడ కూడా బిజినెస్ బాగా జరగడంతో మంచి రాబడి వచ్చింది. రోజుకు దాదాపు రూ.25 గిరాకీ వస్తున్నట్లు నాగేంద్ర చెబుతున్నారు. ఇందులు ఖర్చులు పోగా.. రోజుకు సుమారు రూ. 5 నుంచి రూ.8 వేల మధ్య లాభం వస్తున్నట్లు తెలుస్తోంది.

చదువుకునే వయసులో వ్యాపారం ప్రారంభించాలన్న అతని ఆలోచనకు కుటంబ సభ్యులు ఒకే చెప్పడు. నాగేంద్ర బిజినెస్ సక్సెస్ అవ్వడం ఈనాటి ఆదర్శం. అయితే నాగేంద్ర కు ఈ విజయం సులభంగా రాలేదు. అతను ప్రతి రోజు ఉదయం లేచి షాపులపై సమీక్షించి.. అవసరమైన సామాన్లు వారికి పంపించి ఉదయం 10 గంటలకు కాలేజీకి వెళ్లేవాడు. సాయంత్రం రాగానే ఒక్కో షాప్ తిరుగుతూ వ్యాపారం ఎలా ఉందో తెలుకునేవాడు. అంతేకాదు కస్టమర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేవాడు. నాగేంద్ర భవిష్యత్ మంచి బిజినెస్ మ్యాన్ అవుతారని పలువురు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+