N Chandrasekaran: గత ఏడాది భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా వయోభారంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిరంతరం దేశం కోసం, దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల జీవితాలను మెరుగుపరచటానికి ప్రయత్నించిన రతన్ టాటా తన మరణం తర్వాత కూడా తన ఆశయాలను ముందుకు తీసుకెళుతున్నారు. ఆయన మరణం తర్వాత కూడా వంటవాడు, శంతను నాయుడికి ప్రయోజనం కలిగేలా వీలునామా రాసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఆయన మరణించిన చాలా వారాల తర్వాత ఆసక్తికర సంఘటన చోటుచోసుకుంది. టాటా సన్స్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. దీనిని దివంగత రతన్ టాటా స్థాపించారు. టాటా తన సంపదలో ఎక్కువ భాగాన్ని ఈ ఫౌండేషన్‌కు దాతృత్వ సేవలకు వినియోగించటం కోసం అందించారు. రతన్ టాటా దీని బాధ్యతలను చంద్రశేఖరన్ చూసుకోవాలని కోరుకోవటంతో.. న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత చంద్రశేఖరన్‌ను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమిస్తారని వర్గాలు తెలిపాయి.

టాటా సన్స్ ఛైర్మన్ టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉండకుండా నిరోధించే నియమం ఇక్కడ వర్తించదు ఎందుకంటే ఈ ఫౌండేషన్ టాటా ట్రస్ట్‌తో అనుసంధానించబడి లేదు. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా ఈ ఫౌండేషన్‌లో ఎలాంటి భాగస్వామి కానందున చంద్రశేఖరన్ దీని బాధ్యతలు చేపట్టడానికి అర్హులుగా తెలుస్తోంది. ప్రస్తుతం రతన్ టాటా మరణం తర్వాత ఆయన సంకల్పాన్ని డారియస్ ఖంబాటా, మెహ్లి మిస్త్రీ, షిరిన్ అండ్ డయానా జెజిభోయ్ లు ముందుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడైంది. RTEF బోర్డులో ట్రస్టీల నియామకానికి సంబంధించి స్పష్టమైన లిఖిత సూచనలు లేవు.
రతన్ టాటా గత ఏడాది అక్టోబర్‌లో 86 ఏళ్ల వయసులో మరణించారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో ఆయనకు దాదాపు 0.83% వాటాలు ఉన్నాయి. అతని మొత్తం సంపద సుమారు రూ.8,000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. దీనికి తోడు ఇతర ఆస్తులు, రతన్ టాటా పెట్టుబడులను పరిగణిస్తే మెుత్తం సంపద విలువ ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications