Mysore Sandal: చరిత్ర సృష్టించిన మైసూర్ శాండిల్ సోప్.. ప్రత్యర్థి కంపెనీలకు దబిడిదిబిడే..
Body Soaps: మార్కెట్లో వందలాది కంపెనీలు బాడీ కేర్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. సబ్బుల విభాగంలో ఈ సంఖ్య ఇంకాస్త ఎక్కువే అని చెప్పాలి. అయితే ఏళ్ల తరబడి భారతీయులు ఎంతో ఇష్టంగా వినియోగించే సబ్బుల్లో మైసూర్ శాండిల్ ఒకటి. ఇప్పటికీ మార్కెట్లో పోటీని తట్టుకుంటూ, మరింతగా దూసుకుపోతోంది. నకిలీ సబ్బుల తయారీ, ప్రచార ఆర్భాటం లేకున్నా రికార్డులు సృష్టిస్తోంది.
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఈ ఐకోనిక్ మైసూర్ శాండల్ సోప్ ను తయారు చేస్తోంది. ఇటీవల ఆ కంపెనీ ఫలితాలను చూస్తే ప్రత్యర్థులకు మతి పోయినంత పనైంది. మార్చి 2024లో 1,570 కోట్ల టర్నోవర్‌తో మునుపటి విక్రయాల రికార్డులన్నింటినీ అధిగమించింది. ఆ స్థాయి టర్నోవర్‌కు తగినట్లుగానే సేల్స్‌లోనీ చరిత్ర సృష్టించింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 1,375 కోట్ల టర్నోవర్ కంటే KSDL ఈసారి 195 కోట్లు ఎక్కువ సాధించింది. దీంతో ఇప్పటి వరకు ఇదే అత్యధిక టర్నోవర్‌గా నిలిచింది. ఏడాది ప్రాతిపదికన ఏకంగా 14.25 శాతం పెరుగుదలను నమోదుచేసింది. KSDL గతేడాదిలో 182 కోట్లు లాభాన్ని ఆర్జించగా.. ఈ ఏడాది 68 కోట్లు అదనంగా సంపాదించి 250 కోట్ల మేర లాభాల సునామీ సృష్టించింది.
KSDL తన ప్రీమియమ్ బాత్ సోప్‌కు మరింత మెరుగులు దిద్ది మైసూర్ శాండల్ ప్రీమియం గోల్డ్‌గా అదనపు గంధంతో విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే దీని ధర మాత్రం సామాన్యుడికి షాక్ ఇచ్చేట్లుగా ఉంటుందని సమాచారం. 100గ్రా. సబ్బు ధర ఏకంగా వెయ్యి వరకు ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ట్రాన్స్‌పరెంట్ బాతింగ్ సోప్ కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఏడాది కాలంలో షవర్ జెల్, వేవ్ డియో సోప్ సహా 21 కొత్త ఉత్పత్తులను సదరు సంస్థ రిలీజ్ చేసింది.


Click it and Unblock the Notifications