Myntra: ఏకకాలంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించటం అనేది అంత సులువైన విషయం కాదు. పైగా ప్రస్తుత ద్రవ్యోల్బణ సమయంలో ఉపాధి అవకాశాల కోసం చాలా మంది యువత దేశంలో ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఆన్ లైన్ షాపింగ్ సంస్థ పండుగ సమయంలో కల్పిస్తున్న అవకాశం గురించి ఇప్పుడు తెలుసుకోండి.

మింత్రా ప్రకటన..
రానున్న పండుగల సీజన్లో ఆన్ లైన్ కంపెనీలకు భారీ సంఖ్యలో ఆర్డర్లు వస్తుంటాయి. వీటి డెలివరీ, ప్రాసెసింగ్ కోసం వేల సంఖ్యలో ఉద్యోగులు అవసరం. అందుకోసం సుమారు ఈ-కామర్స్ వెబ్‌సైట్ 16 వేల మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్ చేయబోతోంది. Flipkart ఆధీనంలోని Myntra ఫ్యాషన్ విభాగం దీనికి సంబంధించి ప్రకటన చేసింది. కంపెనీ ఉద్యోగులను ఎలా తీసుకుంటుంది..? కంపెనీ ప్లాన్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఉద్యోగి పని ఇదే..
డెలివరీ, లాజిస్టిక్స్, వేర్‌హౌస్ నిర్వహణ కోసం 16,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను కంపెనీ సృష్టించబోతోంది. వీటిలో 10,000 మందికి ప్రత్యక్షంగా 6,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ నుపుర్ నాగ్‌పాల్ తెలిపారు. కంపెనీ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అన్ని పండుగ సీజన్‌లోనూ ఇదే అత్యధిక నియామకమని ఆయన వెల్లడించారు.

కరోనా తర్వాత..
గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 11,000 మందిని నియమించుకుంది. ఇందులో 7 వేల మంది ప్రత్యక్ష ఉద్యోగాలు ఉన్నారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాల కంటే ఈసారి పండుగను కోలాహలంగా జరుపుకుంటారని భావిస్తున్నట్లు నాగ్‌పాల్ తెలిపారు. ఈ పండుగ సీజన్‌లో బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సందర్భంగా.. సార్టింగ్, ప్యాకింగ్, పికింగ్, లోడింగ్, అన్‌లోడింగ్, డెలివరీ, రిటర్న్ ఇన్‌స్పెక్షన్, కార్గో ఫ్లీట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తారన్నారు.

వికలాంగులకు అవకాశం..
కంపెనీ ఉంచబోతున్న ఉద్యోగుల్లో 6 వేలకు పైగా మైంట్రా కంపెనీలో చేరనున్నారు. ఇది గతేడాది కంటే 50 శాతం ఎక్కువ. 6,000 కంటే ఎక్కువ బ్రాండ్‌లు Myntra BFFలో భాగంగా ఉంటాయి. ఈ పండుగ సీజన్‌లో జరిగే ఈ రిక్రూట్‌మెంట్‌లలో వేర్‌హౌస్ టీమ్‌లో సుమారు 2,500 మంది మహిళలు, 300 మందికి పైగా వికలాంగులను చేర్చాలని భావిస్తున్నారు. పండుగ వ్యాపారాన్ని క్యాష్ చేసుకునేందుకు షాపింగ్ సైట్లు ముందుగా ఉద్యోగుల నియామకాలను చేపడుతున్నాయి.


Click it and Unblock the Notifications