హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్‌లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిని పెంచాయి. జనవరి తగ్గుదల తర్వాత మ్యూచువల్ ఫండ్‌లు పెట్టుబడులు పెట్టాయి. రూ. 13,850 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. డిసెంబరు త్రైమాసికంలో దాదాపు 1.53 కోట్ల షేర్లను విక్రయించిన తర్వాత ఈ నిధులతో జనవరిలో 8.83 కోట్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేశాయి.
జనవరి 2024 నాటికి మ్యూచువల్ ఫండ్స్ దాదాపు 136.26 కోట్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లను కలిగి ఉన్నాయి. ఇది డిసెంబర్ 2023లో 127.44 కోట్లుగా ఉండేది. ఈ కాలంలో ఈ షేర్ల విలువ రూ. 2.18 లక్షల కోట్ల నుంచి రూ. 1.99 లక్షల కోట్లకు తగ్గిందని, ప్రైమ్‌డేబేస్ డేటా ప్రకారం తెలుస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పెట్టుబడి పెట్టిన 40 మ్యూచువల్ ఫండ్లలో 27 జనవరిలో తమ హోల్డింగ్‌లను పెంచాయి.

అయితే 13 తమ వాటాలలో కొంత భాగాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాయి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ అత్యధికంగా రూ. 3,933 కోట్ల కొనుగోలు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ రూ. 2,981 కోట్లు, కోటక్ మ్యూచువల్ ఫండ్ రూ. 2,625 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. జనవరిలో రూ. 52,921 కోట్ల విలువైన 36.18 కోట్ల షేర్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ అతిపెద్ద వాటాదారుగా ఉంది
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ 16.2 కోట్ల షేర్లు అంటే రూ.23,686 కోట్లు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ 13.69 కోట్ల షేర్లతో అంటే రూ.19,990 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇతర ప్రధాన హోల్డర్లలో UTI మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్, మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ ఉన్నాయి.
డిసెంబరు త్రైమాసిక ఆదాయాలలో నిరుత్సాహపరిచిన డిపాజిట్, లిక్విడిటీ కొలమానాల తర్వాత జనవరిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 14.4 శాతానికి పైగా క్షీణించాయి. HDFC బ్యాంక్‌తో పాటు, మ్యూచువల్ ఫండ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ సుజుకి ఇండియా, లార్సెన్ & టూబ్రో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1,460 నుంచు రూ. 3,139 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాయి. మ్యూచువల్ ఫండ్లు రూ. 3,377 కోట్లను ఉపసంహరించుకోవడంతో ICICI బ్యాంక్ అమ్మకాలలో ముందుంది. ఇన్ఫోసిస్, NTPC, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్ కూడా భారీగా విక్రయించారు.


Click it and Unblock the Notifications