ప్రజల్లో పెరుగుతున్న పెట్టుబడి ధోరణి.. ఆల్‌టైం గరిష్ఠానికి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్
Mutual Funds: తక్కువ సమయంలో ఎక్కువ రాబడి ఆశించే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఒక బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాయి. అందుకే కొంత రిస్క్ ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు వెనుకంజ వేయడం లేదు. సాంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్లను కాదని వీటిపైవు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. రోజురోజుకీ ఈ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
స్వల్ప ఆదాయ వర్గాల వారికి కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఒక చక్కని ఎంపికగా తయారైంది. కేవలం 100 నుంచి మొదలుపెట్టి ఎంతవరకైనా పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఉండటంతో మధ్యతరగతి ప్రజలు కూడా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా ఇండియాలో సిప్(SIP) ద్వారా ఇన్వెస్ట్ చేసే వారు ఎక్కువవుతున్నారు.

ఆగస్టులో సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(SIP) ద్వారా మొత్తం 15 వేల 814 కోట్లు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లోకి పెట్టుబడులుగా వచ్చినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(AMFI) గణాంకాలు చెబుతున్నాయి. అంతకు ముందు నెలతో పోలిస్తే దాదాపు 570 కోట్లు మేర ఇన్ ఫ్లో పెరిగింది. ఇదే ఆల్ టై హై కావడం విశేషం.
'SIP మోడ్ లో ఇన్వెస్ట్ చేసిన చిన్న మొత్తాలు కలిపి ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో దాదాపు 16 వేల కోట్లకు చేరుకోవడం హర్షణీయం. ఈ విధమైన పెట్టుబడులతో సంపదను పెంచుకోవడానికి భారతీయులు ఆలోచిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వృద్ధి విధానానికి నిదర్శనం. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటంతో పాటు మార్కెట్లు కూడా వృద్ధి చెందుతాయి' అని AMFI CEO NS వెంకటేష్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications