IT Stocks: ఐటీకి టైమొచ్చిందా.. ఐటీ కంపెనీల్లో భారీగా పెట్టుబడి పెడుతున్న మ్యూచువల్ ఫండ్స్..!
గత కొంత కాలంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఐటీ స్టాక్స్ జూలైలో కాస్త పుంజుకున్నాయి. ఏఐ వల్ల భారత ఐటీ కంపెనీల పని అయిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, టెక్ మహింద్రా, విప్రోతో పాటు చాలా కంపెనీల స్టాక్స్ పడిపోయాయి. అయితే జూలైలో ఐటీ స్టాక్స్ పుంజుకున్నాయి. మ్యూచువల్ ఫండ్‌లు ఈ జూలైలో ఐటీ స్టాక్‌లలో తమ పెట్టుబడిని 6.6 శాతానికి పెంచుకున్నాయి. ఏఐ (AI) పరిశ్రమను కుదిపేస్తుందనే ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, ఐటీ స్టాక్ ధరలు మరింత ఆకర్షణీయంగా కనిపించడంతో పెట్టుబడులు పెరిగినట్లు చెబుతున్నారు.
అయినప్పటికీ ఈ కేటాయింపు జూలై 2025లో నమోదైన 8 శాతానికి స్థాయికి ఇంకా చేరుకోలేదు. జూన్‌లో కొంత ఇబ్బంది పడిన తర్వాత, ఐటీ-కేంద్రీకృత మ్యూచువల్ ఫండ్‌లు ఈ నెలలో 13.87 శాతం వృద్ధితో బలమైన పనితీరును కనబరిచాయి. నిఫ్టీ ఐటీ సూచీ కూడా 19 శఆతం ఎగబాకింది. గత ఆరేళ్లలో ఇదే అత్యుత్తమ నెలవారీ పెరుగుదల. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడటం, వాల్యుయేషన్లు పెరగడంతో పెట్టుబడిదారుల విశ్వాసం మళ్లీ పుంజుకుంటోందని ఇది సూచిస్తోంది. అయితే తాజా ఐటీ స్టాక్స్ మళ్లీ పడిపోతున్నాయి. బలహీనపడిన యూఎస్ డాలర్ రేటు, భౌగోళిక రాజకీయ ఆందోళనలు, అధిక వృద్ధి రంగాలలో బలహీనమైన ఊపు వంటి పలు అంశాలపై పెట్టుబడిదారులు దృష్టి సారించడంతో సోమవారం టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్‌టీఎం, ఎంఫసిస్ వంటి ఐటీ స్టాక్‌లు ప్రధాన రంగ సూచీ అయిన నిఫ్టీ ఐటీని దాదాపు 2 శాతం డ్రాగ్ చేశాయి.

గత వారం శుక్రవారం నాటి ఈక్విటీ మార్కెట్ ముగింపులో 31,357.75 పాయింట్లతో పోలిస్తే, సోమవారం నాటి మార్కెట్‌లో ప్రధాన నిఫ్టీ ఐటీ సూచీ 1.83 శాతం పడిపోయి, ఇంట్రాడే కనిష్ట స్థాయి 30,783.50 పాయింట్లకు చేరింది. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ విభాగంలో పెట్టుబడిదారుల నిస్తేజమైన సెంటిమెంట్ కారణంగా నిఫ్టీ మిడ్‌స్మాల్ ఐటీ & టెలికాం సూచీ 1.02% క్షీణించింది. ఆసియా మార్కెట్లలోని టెక్ స్టాక్‌ల ఊపును కూడా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు గమనిస్తున్నారు. భౌగోళిక రాజకీయ ప్రమాదాల నేపథ్యంలో సింగపూర్ ఎఫ్‌టిఎస్‌ఈ నష్టాలతో ట్రేడ్ అవుతుండగా, నిక్కీ 225, షాంఘై కాంపోజిట్ వంటి ఇతర సూచీలు స్వల్పంగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.
ప్రపంచ కరెన్సీ మార్కెట్లలోని అస్థిరత నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్ సెషన్‌లో భారత రూపాయి తో పోలిస్తే అమెరికన్ డాలర్ బలహీనపడటం, తత్ఫలితంగా ఈక్విటీ మార్కెట్‌లో నమోదైన భారతీయ ఐటీ కంపెనీల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. భారతీయ IT కంపెనీల క్లయింట్లు ఎక్కువగా అమెరికాలోనే ఉండటం వల్ల, డాలర్ మారకం విలువలో వచ్చే మార్పులు నేరుగా కంపెనీల లాభాల మార్జిన్లపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications