Paytm: పేటీఎంలో వాటాను పెంచుకుంటున్న మ్యూచువల్ ఫండ్లు..
ఫిన్‌టెక్ మేజర్ పేటీఎంపై ఆర్బీఐ చర్యల తర్వాత ఆ స్టాక్ భారీగా పడిపోయింది. అయినప్పటికీ 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కంపెనీలో మ్యూచువల్ ఫండ్‌లు తమ వాటాను పెంచుకున్నాయి. బీఎస్ఈలో అందుబాటులో ఉన్న షేర్‌హోల్డింగ్ డేటా ప్రకారం, దేశీయ మ్యూచువల్ ఫండ్‌లు గత డిసెంబర్ త్రైమాసికం (Q3) చివరినాటికి పేటీఎంలో 4.99 శాతం వాటాను హోల్డ్ టేస్తుండుగా.. మార్చి త్రైమాసికం (Q4) చివరి నాటికి తమ వాటాను 6.15%కి పెంచుకున్నాయి.
పేటీఎంని నడుపుతున్న One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL), కొత్త యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) IDలు లేదా హ్యాండిల్స్‌ను ఇతర పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంకులకు మార్చుతోంది. కంపెనీ తన UPI ఐడీలను మార్చుతోంది. ఎస్బీఐ, హెచ్ డీఎఫ్సీ, యాక్సిస్, యస్ బ్యాంక్ పేటీఎం భాగస్వామ్య బ్యాంకులుగా వ్యవహరించనున్నాయి. ఇప్పటికే చాలా మందికి పేటీఎం యూపీఐ ఐడీ మారింది.

గతంలో @patym ఉండే యూపీఐ ఐడీ ఇప్పుడు @ptsbi, @pthdfc, @ptaxis, @ptyes గా మార్చుతున్నారు. యూపీఐ ఐడీలు మార్చడానికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏప్రిల్ 17న, పేటీఎం తన కస్టమర్లను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) నుంచి దాని భాగస్వామి చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ (PSP) బ్యాంకులకు తరలించడం ప్రారంభించినట్లు ప్రకటించింది.
మార్చి 15న ఆర్బీఐ ఆంక్షలు అమలులోకి వచ్చిన రోజున పేటీఎం యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐతో PSP భాగస్వాములుగా థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా పని చేయడం ప్రారంభించింది. Paytmకి దాదాపు తొమ్మిది కోట్ల మంది UPI కస్టమర్‌లు ఉన్నారు. వారు కొత్త యూపీఐ హ్యాండిల్స్‌కు మారాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications