Power Multibagger: ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్ల ర్యాలీలో అనేక మల్టీబ్యాగర్స్ పవర్ ఫుల్ రాబడులతో తమ ఇన్వెస్టర్లకు డబ్బులు కురిపిస్తున్నాయి. ఒక పవర్ కంపెనీ షేర్లు సైతం వేగంగా దూసుకుపోతున్నాయి.
గత 3 మూడేళ్ల కాలంలో TD పవర్ కంపెనీ షేర్ల ధర 1400 శాతానికి పైగా పెరిగాయి. ఈ క్రమంలో స్టాక్ ధర రూ.16 నుంచి రూ.345 స్థాయికి ర్యాలీ చేసింది. కరోనా తర్వాత స్టాక్ మార్కెట్లో సందడి చేస్తోంది. అనేక మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సైతం ఇందులో పెట్టుబడులు పెట్టాయి. నేడు మధ్యాహ్నం 2.02 గంటల సమయంలో కంపెనీ షేర్ ధర 2 శాతం మేర క్షీణించి రూ.244.05 వద్ద ట్రేడవుతోంది.

గత నెల రోజుల్లో కంపెనీ షేర్ల ధరలు 15 శాతం మేర పెరిగాయి. అదే సమయంలో 6 నెలల క్రితం ఈ స్టాక్‌ను కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు ఇప్పటివరకు 80 శాతానికి పైగా రాబడిని పొందారు. ఏడాది క్రితం ఈ ఎనర్జీ స్టాక్ ధర రూ.103 వద్ద ఉండేది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు షేర 130 శాతం లాభపడింది.
నెల రోజుల క్రితం టీడీ పవర్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్‌కి ఇప్పటికి రూ.1.15 లక్షల రాబడి వచ్చేది. అదే సమయంలో 6 నెలల కిందట ఇన్వెస్ట్ చేసిన వారికి రూ.1.80 లక్షలు రాబడి వచ్చేది. అదేవిధంగా 3 సంవత్సరాల క్రితం టిడి పవర్ షేర్లపై రూ.లక్ష ఇన్వెస్ట్ చేసిన దానిని ఇప్పటి వరకు కొనసాగించిన ఇన్వెస్టర్లు రూ.15 లక్షల లాభం పొందారు.
2023లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న షేర్ హోల్డింగ్ ప్రకారం.. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు TD పవర్ సిస్టమ్స్‌లో 15.23 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అంటే వారి వద్ద 2,37,68,721 షేర్లు ఉన్నాయి. టాటా స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్‌ఎస్‌బిసి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, నిప్పోల్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఈ పవర్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి.


Click it and Unblock the Notifications