Mutual Funds: జులైలో అత్యధిక పెట్టుబడులను పొందిన మ్యూచువల్ ఫండ్స్ ఇవే..!

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెరుగుతోన్నాయి. జులైలో దాదాపు ఎనిమిది ఈక్విటీ, ఈక్విటీ-ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ లోకి రూ. 3,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఫండ్స్ నిర్వహించే ఆస్తుల ఆధారంగా అతిపెద్ద మిడ్‌క్యాప్ ఫండ్ అయిన హెచ్‌డిఎఫ్‌సి మిడ్-క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ నెలవారీ ప్రాతిపదికన అత్యధికంగా రూ.4,812 కోట్ల పెట్టుబడిని ఆకర్షించింది. ఈ పథకం జూన్‌లో రూ. 70,569 కోట్ల AUMను కలిగి ఉంది. ఇది ఇప్పుడు జులైలో రూ. 75,382 కోట్లకు పెరిగింది.

పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నెలవారీ ప్రాతిపదికన రూ.4,255 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఈ పథకం జూన్‌లో రూ.71,700 కోట్లకు గాను జులైలో రూ.75,956 కోట్లకు చేరింది. జులైలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ లోకి రూ.4,145 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పథకం జూన్‌లో రూ. 89,903 కోట్లకు గాను జలైలో రూ.94,048 కోట్లకు పెరిగింది. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ నెలవారీ ప్రాతిపదికన మొత్తం రూ. 3,903 కోట్ల ఇన్ ఫ్లోను పొందింది.

జూన్‌లో రూ.56,468 కోట్లతో పోలిస్తే జులైలో ఈ పథకం మొత్తం రూ.60,372 కోట్లకు పెరిగింది. కోటక్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్‌కు నెలవారీ ప్రాతిపదికన మొత్తం రూ.3,570 కోట్ల ఇన్‌ఫ్లో వచ్చింది. పథకం AUM జూన్‌లో రూ. 47,999 కోట్ల నుంతి జూలైలో రూ. 51,569 కోట్లకు పెరిగింది.ఎస్బీఐ కాంట్రా ఫండ్ నెలవారీ ప్రాతిపదికన మొత్తం రూ. 3,479 కోట్లను అందుకుంది. ఈ పథకం జూన్‌లో రూ. 34,366 కోట్లకు గాను జులైలో రూ.37,845 కోట్లకు చేరింది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నుంచి రెండు పథకాలు - ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ నెలవారీ ప్రాతిపదికన వరుసగా రూ. 3,352 కోట్లు, రూ. 3,335 కోట్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షించాయి.

Read more about: mutual funds investments

English Summary

There were huge investments in many mutual funds in July. Let's see what are the mutual funds with huge investments.